News October 29, 2025

MBNR: పుణ్యక్షేత్రాలకు స్పెషల్ బస్.. ఫోన్ చేయండి

image

అరుణాచలం గిరి ప్రదక్షిణకు MBNR డిపో నుంచి సూపర్ డీలక్స్ బస్ నడుపుతున్నట్లు డిపో మేనేజర్ సుజాత Way2Newsతో తెలిపారు. ఈనెల 31న రాత్రి 7గం.కు బస్ MBNR నుంచి బయలుదేరుతుందని, కాణిపాకం, మహాలక్ష్మి, అరుణాచలం చేరుకొని అరుణాచలం గిరిప్రదక్షిణ అనంతరం NOV 3న MBNRకు చేరుకుంటుందన్నారు. ఒక్కొక్కరికి రూ.3,600 (ప్యాకేజ్) టికెట్ ధర ఉందన్నారు. 99592 26286, 94411 62588 సంప్రదించాలన్నారు.
Web:https://tsrtconline.in

Similar News

News October 29, 2025

రేపటి నుంచి ఎన్టీఆర్ జిల్లాలో స్కూల్స్ రీ ఓపెన్.. కానీ కండిషన్స్ అప్లై!

image

తుఫాన్ ప్రభావం లేని, పునరావాస కేంద్రాలుగా ఉపయోగించని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను ఈ నెల 30వ తేదీ నుంచి రీఓపెన్ చేయాలని జిల్లా కలెక్టర్ లక్ష్మిశ తెలిపారు. అయితే, పాఠశాల భవనాలు సురక్షితమని అధికారులు ధ్రువీకరించిన తర్వాతే తెరవాలని సూచించారు. ప్రతి పాఠశాల ప్రాంగణంలో, తరగతి గదుల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని హెచ్ఎంలు, ప్రిన్సిపల్స్‌ను కలెక్టర్ ఆదేశించారు.

News October 29, 2025

తుఫాను ప్రభావిత ప్రజలకు సకాలంలో నిత్యావసర సరుకుల పంపిణీ చేయాలి: కలెక్టర్

image

మొంథా తుఫాను ప్రభావిత ప్రాంత ప్రజలకు సకాలంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. బుధవారం రెవెన్యూ, వ్యవసాయం, మత్స్య, పౌరసరఫరాల శాఖల అధికారులతో ఆయన జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పునరావాస కేంద్రాల్లోని ప్రతి కుటుంబానికి రూ.3 వేల ఆర్థిక సహాయం పంపిణీ, తుఫాను నష్ట గణనపై అధికారులతో చర్చించారు.

News October 29, 2025

అలా అయితే బంగ్లాదేశ్‌కు వెళ్తా: షేక్ హసీనా

image

భారత్‌లో ఉంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తొలిసారి మీడియాతో తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. రాబోయే బంగ్లా ప్రభుత్వం చట్టబద్ధంగా ఎన్నికవ్వాల్సిన అవసరం ఉందని రాయిటర్స్‌కు మెయిల్‌లో తెలిపారు. అవామీ లీగ్‌కు లక్షలాది మంది మద్దతిస్తున్నారని, తమ పార్టీని పోటీకి అనుమతించకుంటే 2027 ఎన్నికలను వారు బహిష్కరిస్తారన్నారు. చట్టబద్ధమైన ప్రభుత్వం, శాంతిభద్రతలు అదుపులో ఉంటే బంగ్లా వెళ్తానని చెప్పారు.