News April 11, 2024
MBNR: పెరుగుతున్న CNG వాహనాల వినియోగం

ఉమ్మడి జిల్లాలో CNG వాహనాల వినియోగం పెరుగుతుంది. ధర తక్కువగా ఉండడం మంచి మైలేజీ రావడంతో CNG వాహనాలు వినియోగించేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు. కిలో CNG ధర రూ.90 కాగా ఆటోలకు 40 కి.మీ, కార్లకు 32 కి.మీ మైలేజీ వస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా CNG కార్లు, ఆటోలు 2,037 ఉన్నాయి. CNG వాహనాలు అత్యధికంగా 920 మహబూబ్ నగర్ జిల్లాలో, అత్యల్పంగా 192 నారాయణపేట జిల్లాలో ఉన్నాయి.
Similar News
News April 21, 2025
రైతులకు భూ భారతి భరోసా: కలెక్టర్

అడ్డాకల్: పట్టేదారు రైతు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించి వారికి భరోసా కల్పించేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భూ భారతి అవగాహన సదస్సులో చట్టంపై రైతులకు వివరించారు. రెవెన్యూ రికార్డులు ఏమన్నా లోటుపాట్లు ఉంటే భూభారతిలో సరిచేసుకునే అవకాశం ఉందన్నారు. దీనిపై అవగాహన పెంచుకొని రైతులందరూ వినియోగించుకోవాలన్నారు.
News April 21, 2025
MBNR: ‘చెరువులలో పూడికతీత చేపట్టాలి’

జిల్లాలోని చెరువులు, కుంటల్లో పూడికతీత పనులు చేపట్టాలని ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు మెట్టుకాడి ప్రభాకర్ కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. పూడికతీత పనులు చేపట్టడం ద్వారా చెరువులు, కుంటలలో నీరు ఎక్కువగా నిలిచి చేపల ఉత్పత్తి పెరుగుతుందన్నారు. చేపల వేట, విక్రయాలపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు.
News April 21, 2025
రేపే ఇంటర్ ఫలితాలు.. MBNRలో 22,483 మంది

తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాలను రేపు విడుదల చేయనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 22,483 ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. ఇందులో ఫస్టియర్‌లో 10,922, సెకండియర్‌లో 11,561 మందికి పరీక్షలు నిర్వహించారు. కాగా వీరి భవితవ్యం రేపటితో తేలనుంది. ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి.
– ALL THE BEST