News December 4, 2024
MBNR: ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్
దివ్యాంగుల సంక్షేమ కోసం ప్రభుత్వం సంక్షేమ కార్య క్రమాలు అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం అంబేడ్కర్ అడిటోరియంలో ప్రపంచ దివ్యాంగులదినోత్సవ వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆమె సమాన అవకాశాలు, గౌరవంగా జీవించేందుకు కేంద్ర ప్రభుత్వం దివ్యాంగుల హక్కుల చట్టం 2016 అమలు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News December 5, 2024
GREAT: 4 ‘GOVT’ ఉద్యోగాలు సాధించిన మమత
మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం జిన్నారం గ్రామానికి చెందిన గోపాల్ గౌడ్ కుమార్తె మమత నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. 2018లో పంచాయతీ కార్యదర్శిగా, 2019లో కేజీబీవీ లెక్చరర్‌గా, 2024లో గురుకుల జూనియర్ లెక్చరర్‌గా, ఇటీవల ప్రకటించిన జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో ఉద్యోగం సాధించి గెజిటెడ్ పోస్ట్‌ను దక్కించుకుంది. భర్త సుకుమార్ గౌడ్ ప్రోత్సాహంతోనే విజయాన్ని సొంతం చేసుకున్నట్లు తెలిపారు.
News December 5, 2024
మిడ్జిల్: పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
విద్యార్థులకు పాఠ్యాంశాలు అర్థమయ్యే రీతిలో బోధించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. మిడ్జిల్ మండలం బోయిన్‌పల్లి జెడ్‌పి ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి బుధవారం తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ మధ్యాహ్న భోజనం, పాఠశాల పరిసరాలు పరిశీలించారు. బియ్యం,ఆహార పదార్థాలు పరిశీలించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతతో అందించాలని, ఎటువంటి ఫిర్యాదులు రానివ్వకూడదని సూచించారు.
News December 5, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!
✔రేపు పుష్ప-2 రిలీజ్.. మొదలైన హంగామా✔NGKL:నూతన డీఈవోగా రమేష్ కుమార్✔ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న చలి✔NGKL: బైక్‌కు నిప్పు పెట్టిన దుండగులు✔అడ్డాకుల: ట్రాక్టర్, డీసీఎం ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు✔గద్వాలలో రేపు చేనేత సంబరాలు✔కనీస వేతనం చెల్లించాలని ఆశ వర్కర్ల ధర్నా✔నియామక పత్రాలు అందుకున్న గ్రూప్-4 అభ్యర్థులు✔పలువురికి CMRF చెక్కులు అందజేత✔మధ్యాహ్న భోజనం.. తనిఖీ చేసిన ఎమ్మెల్యేలు