News November 3, 2024
MBNR: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి: TG UTF
బడుగు బలహీన వర్గాల బిడ్డలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని టీజీ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ పేర్కొన్నారు. 2024 డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు టీఎస్ యుటిఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు. నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
Similar News
News November 24, 2024
ఈ నెల 30న మహబూబ్‌నగర్‌కు సీఎం రేవంత్
ఈ నెల 30వ తేదీన మహబూబ్‌నగర్‌కు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఆదివారం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి హాజరయ్యారు. మంత్రి జూపల్లి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు జిల్లా అధికారులతో సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభ ఏర్పాటు స్థలాన్ని పరిశీలించి మీడియాతో మాట్లాడారు.
News November 24, 2024
MBNR: చివరి దశకు సర్వే.. కుటుంబాలు ఎన్నంటే!
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వే చివరి దశకు చేరింది. మొత్తం MBNR-2,41,853, NGKL-2,50,596, GDWL-1,67,886, NRPT-1,55,999, WNPT-1,54,793 కుటుంబాలు ఉన్నాయి. ఒక్కో ఎన్యూమరేటర్‌కు 150 నుంచి 180 ఇళ్లు కేటాయించారు. ఈ నెల 27 వరకు సమగ్ర సర్వే 100% పూర్తి చేస్తామని ఆయా జిల్లాల అధికారులు తెలిపారు.
News November 24, 2024
MBNR: TCC కోర్సు.. ఫీజు చెల్లించండి!!
టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు(TCC) పరీక్ష ఫీజు తేదీలు ఖరారు అయ్యాయని ఆయా జిల్లాల డీఈవోలు తెలిపారు. డ్రాయింగ్ కోర్సు-లోయర్ రూ.100, హయ్యర్ రూ.150, ఎంబ్రాయిడరింగ్, టైలరింగ్ కోర్సు-లోయర్ రూ.150, హయ్యర్ రూ.200ను ఆన్‌లైన్లో చెల్లించాలన్నారు. డిసెంబర్ 3 లోగా చెల్లించాలని, 10వ తరగతి చదివిన వారు అర్హులన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.