News March 17, 2025

MBNR: ప్రేమించుకుని పెళ్లి.. నెలన్నరకే ఆత్మహత్య

image

జడ్చర్ల మండలంలో నవ వధువు ఆదివారం ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. స్థానికుల వివరాలు.. రాళ్లగడ్డతండాకు చెందిన పవన్‌కుమార్, ఖమ్మం జిల్లాకు చెందిన చర్చిత(23) ఖమ్మంలో చదువుతున్న సమయంలో ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి 45రోజుల క్రితం పెళ్లిచేసుకున్నారు. కారణం ఏంటో తెలియదు కాని పవన్ ఇంట్లో నుంచి బయటికెళ్లగానే చర్చిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

Similar News

News November 4, 2025

బోయిన్‌పల్లిలో దారుణం.. చిన్నారిపై డాన్స్ మాస్టర్ వేధింపులు

image

ఓల్డ్‌ బోయిన్‌పల్లిలోని సుబ్బు డాన్స్‌ స్టూడియో నిర్వాహకుడు జ్ఞానేశ్వర్‌ నాలుగేళ్ల బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడు. 2 నెలలుగా డాన్స్ స్కూల్‌కు వెళ్తున్న చిన్నారి ఈమధ్య ఆకస్మికంగా మానేసింది. చిన్నారి చెప్పిన వివరాల మేరకు తల్లిదండ్రుల ఫిర్యాదుతో బోయిన్‌పల్లి పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. స్టూడియోను మూసివేసినట్లు ఉత్తర మండల డీసీపీ రష్మీ పెరుమాళ్‌ తెలిపారు.

News November 4, 2025

పాక్ ప్లేయర్ హరీస్ రవూఫ్‌పై ఐసీసీ వేటు

image

ఆసియా కప్‌లో కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించిన ఆటగాళ్లపై ICC చర్యలు తీసుకుంది. పాక్ ప్లేయర్‌ హరీస్ రవూఫ్‌పై 2 మ్యాచుల బ్యాన్ విధించింది. 24 నెలల వ్యవధిలో 4 డీమెరిట్ పాయింట్లు తెచ్చుకున్నందుకు ఈ వేటు వేసింది. 2 మ్యాచుల్లో 30% చొప్పున ఫీజులో కోత పెట్టింది. మరో ఆటగాడు ఫర్హాన్‌కు ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చింది. ఇక <<17831364>>సూర్య<<>>కు మ్యాచ్ (14వ తేదీ) ఫీజులో 30% కోత, 2 డీమెరిట్ పాయింట్లను విధించింది.

News November 4, 2025

నిర్మల్ జిల్లాలో యువకుడి ARREST

image

నిర్మల్ జిల్లా పెంబి మండలం పోచమ్మపల్లికి చెందిన యువకుడు మెగావత్ వినోద్ ఎండు గంజాయిని బైక్‌పై తరలిస్తుండగా పట్టుకున్నట్లు నిర్మల్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ రంగస్వామి తెలిపారు. ఆదిలాబాద్ నుంచి ఎండు గంజాయిని నిర్మల్‌కు తరలిస్తుండగా కొండాపూర్ బ్రిడ్జి వద్ద పట్టుకున్నామన్నారు. అతడి వద్ద 1.710కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని, నిందితుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచామన్నారు. ఎస్ఐ అభిషేకర్, వసంత్ రావ్ ఉన్నారు.