News March 17, 2025

MBNR: ప్రేమ పెళ్లి.. నెలన్నరకే ఆత్మహత్య

image

జడ్చర్ల మండలంలో నవ వధువు ఆదివారం ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. స్థానికుల వివరాలు.. రాళ్లగడ్డతండాకు చెందిన పవన్‌కుమార్, ఖమ్మం జిల్లాకు చెందిన చర్చిత(23) ఖమ్మంలో చదువుతున్న సమయంలో ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి 45రోజుల క్రితం పెళ్లిచేసుకున్నారు. కారణం ఏంటో తెలియదు కాని పవన్ ఇంట్లో నుంచి బయటికెళ్లగానే చర్చిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

Similar News

News July 4, 2025

వనపర్తి: ‘గురుకుల విద్యార్థులకు అన్ని వసతులు కల్పించండి’

image

ప్రభుత్వ గురుకులాల్లో చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ఆయన వనపర్తిలోని కేడీఆర్ నగర్‌లో ఉన్న తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాలను, జగత్పల్లిలో ఉన్న తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్, నాగవరంలో ఉన్న మహాత్మా జ్యోతిబా ఫులే స్కూళ్లను తనిఖీ చేశారు.

News July 4, 2025

ఈ స్కిల్స్ పెంచుకుంటే విజయం మీదే!

image

ఏ రంగంలోనైనా సక్సెస్ పొందేందుకు అవసరమైన నైపుణ్యాలను పెంచుకుంటే విజయం మీ సొంతం అవుతుందని పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా చెప్పారు. ‘ప్రతి ఒక్కరూ తమ సంస్థాగత నైపుణ్యాలు, డెసిషన్ మేకింగ్ & ఎమోషనల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్, సెల్ఫ్ మేనేజ్మెంట్ & నాయకత్వ నైపుణ్యాలు, కమ్యూనికేషన్ & క్రిటికల్ థింకింగ్ స్కిల్స్, పరిశోధన- విశ్లేషణ స్కిల్స్, టీమ్ వర్క్ స్కిల్స్, రైటింగ్స్ నైపుణ్యాలను పెంచుకోవాలి’ అని తెలిపారు.

News July 4, 2025

ఇబ్రహీంపట్నం: ‘నేరాల నివారణే లక్ష్యంగా పనిచేయండి’

image

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీకి పలువురు అధికారులు పుష్ప గుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను, పోలీస్ స్టేషన్ లోని పరిసరాలను, నేరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు కార్యక్రమంలో మెట్‌పల్లి డీఎస్పీ రాములు, సీఐ అనిల్ కుమార్, ఎస్సై అనిల్ తదితరులు పాల్గొన్నారు.