News March 17, 2025

MBNR: ప్రేమ పెళ్లి.. నెలన్నరకే ఆత్మహత్య

image

జడ్చర్ల మండలంలో నవ వధువు ఆదివారం ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. స్థానికుల వివరాలు.. రాళ్లగడ్డతండాకు చెందిన పవన్‌కుమార్, ఖమ్మం జిల్లాకు చెందిన చర్చిత(23) ఖమ్మంలో చదువుతున్న సమయంలో ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి 45రోజుల క్రితం పెళ్లిచేసుకున్నారు. కారణం ఏంటో తెలియదు కాని పవన్ ఇంట్లో నుంచి బయటికెళ్లగానే చర్చిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

Similar News

News February 22, 2026

ఖమ్మం: సేంద్రియ సాగుకు సర్కారు దన్ను

image

రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వం కీలక అడుగు వేసింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో జిల్లాలో సేంద్రియ సాగును విస్తరించేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎంపిక చేసిన 3,750 ఎకరాలకు గాను, ఎకరానికి రూ. 4 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. రైతులకు గోఆధారిత ఎరువులు, జీవామృతం, పంచగవ్య తయారీపై ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు.

News February 22, 2026

ఉద్యమానికి ఇక సెలవు!

image

వరుస ఎన్‌కౌంటర్లు, కీలక నేతల లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ ఉద్యమ ప్రస్థానం ముగింపు దశకు చేరింది. ఎర్రసైన్యం సుదీర్ఘ పోరాటానికి 2021లో ఆర్కే మరణంతో బీటలు వారాయి. తర్వాత హిడ్మా, నంబాల కేశవరావు లాంటి కీలక నేతలు హతమయ్యారు. మల్లోజుల, ఆశన్న, దేవ్‌జీ, రాజిరెడ్డి లొంగిపోయారు. గణపతి విదేశాలకు వెళ్లిపోగా, బడే చొక్కారావు కోసం వేట కొనసాగుతోంది. ప్రస్తుతం అడవుల్లో అతికొద్ది మంది మాత్రమే ఉన్నట్లు సమాచారం.

News February 22, 2026

BREAKING.. చింతూరు: హైవేపై యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

చింతూరు మండలం సింగనగూడెం గ్రామం టర్నింగ్ వద్ద తమిళనాడు నుంచి జైపూర్‌కు వెళ్తున్న కారు ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. కారులో ఐదుగురు ప్రయాణిస్తుండగా.. ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారికి గాయాలయ్యాయి. డ్రైవర్ నిద్రమత్తు, అతివేగం కారణంగా వాహనం నియంత్రణ కోల్పోయి ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.