News May 8, 2024

MBNR: ప్రైవేటు బస్సు బోల్తా.. పది మందికి గాయాలు

image

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఈ ఉదయం ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పది మంది గాయపడ్డారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న బస్సు అడ్డాకుల సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 18, 2025

MBNR: సర్పంచ్ ఎన్నికలు..70 నాఖాబందీ ఆపరేషన్లు

image

సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో భద్రతా చర్యల్లో భాగంగా 70 నాఖాబందీ ఆపరేషన్లు, 37 ఆయుధాల డిపాజిట్, 640 మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. జిల్లావ్యాప్తంగా 3 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగిందని, అలాగే రూ.7,200/- విలువగల ఉచితాల పంపిణీకి సంబంధించిన 1 కేసు, 3 ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసులు, 4 మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి.

News December 18, 2025

MBNR: సర్పంచ్ ఎన్నికలు.. రూ.11,08,250 సీజ్

image

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో భాగంగా చేపట్టిన తనిఖీలు, నిఘా చర్యలలో రూ.11,08,250 నగదును సీజ్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ డి.జానకి వెల్లడించారు. అదేవిధంగా రూ.6,93,858 విలువగల మద్యం కేసులకు సంబంధించి 81 ఎక్సైజ్ కేసులు నమోదు చేసి 1050.23 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

News December 18, 2025

MBNR: లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి: SP

image

ఈ నెల 21 న జిల్లాలో జరిగే లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ జానకి గురువారం ఓ ప్రకటనలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. క్షణికా వేషంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోవడానికి లోక్ అదాలత్ కార్యక్రమం ఉత్తమ అవకాశమని, రాజీ మార్గానికి అవకాశం ఉన్న అన్ని కేసులను పరిష్కరించుకోవాలని కక్షదారులకు సూచించారు.