News October 29, 2025

MBNR: బస్సు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి

image

పెబ్బేరు బస్టాండ్‌లో జరిగిన దుర్ఘటనలో మహిళ మృతి చెందింది. ASI శ్రీనివాస్ కథనం.. NRPT చెందిన కె.అంజమ్మ ఆదివారం గద్వాల నుంచి HYD వెళ్లే బస్సులో ప్రయాణించి పెబ్బేరు వద్ద దిగారు. బస్సు వెనుకన నడుస్తుండగా డ్రైవర్ ఒక్కసారిగా బస్సు స్టార్ట్ చేయడంతో ఆమె వెనుక టైరు కిందపడి కాళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఆమె మరణించింది. ఈ ఘటనపై కూతురు ఫిర్యాదుతో కేసు నమోదైంది.

Similar News

News October 29, 2025

SRPT: టీచర్‌గా మారి పాఠాలు బోధించిన కలెక్టర్

image

ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పాఠాలు బోధించారు. మంగళవారం జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. 4, 5వ తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. వారితో ఇంగ్లిష్ చదివించి తెలుగులో అర్ధాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ప్రతిభకు కలెక్టర్ ఫిదా అయ్యారు.

News October 29, 2025

HNK: ధాన్యం కొనుగోళ్లలో సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్

image

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ధాన్యం కొనుగోలులో ఎదురయ్యే సమస్యల పై ఫిర్యాదుల స్వీకరణకు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ మంగళవారం ప్రారంభించారు. రైతులు ధాన్యం కొనుగోలు సమస్యల పరిష్కారానికి 7330751364ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.

News October 29, 2025

పెద్దపల్లి ప్రయాణికులకు RTC గుడ్ న్యూస్

image

కార్తీక మాసాన్ని పురస్కరించుకొని NOVలో ప్రయాణికుల కోసం GDK డిపో ప్రత్యేక యాత్ర ప్యాకేజీలను ప్రకటించింది. ఈ యాత్రల ద్వారా వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్లే సౌకర్యాన్ని కల్పించింది. NOV 4న యాదాద్రి, 6న శ్రీశైలం, 11న రామేశ్వరం(7 DAY’S), 18న శ్రీశైలం, 23న కాశీ, అయోధ్యకు స్పెషల్ సూపర్ లగ్జరీ, రాజధాని బస్సులను ఏర్పాటు చేశామని DM నాగభూషణం తెలిపారు. మరిన్ని వివరాలకు 7013504982 నంబరును సంప్రదించాలన్నారు.