News April 25, 2025
MBNR: బిల్డింగ్‌పై మృతదేహం కలకలం..!

ఓ యువకుడి మృతదేహం కలకలం సృష్టించిన ఘటన MBNRజిల్లా అడ్డాకులలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. గ్రామ వాసి షేక్‌బాలీ కుమారుడు ముస్తాక్(37) మద్యానికి బానిసై ఇంటికి రాకుండా కొన్నాళ్లుగా నిర్మాణంలోని ఓ బిల్డింగ్‌పై పడుకుంటున్నాడు. గురువారం ఓ కుక్క మనిషి చేతిని నోట కరుచుకుని రోడ్డుపైకి వచ్చింది. స్థానికులు చూసి పోలీసులకు చెప్పారు. వారొచ్చి బిల్డింగ్‌పై చూడగా ముస్తాక్ శవం కుళ్లిపోయి కనిపించింది.
Similar News
News April 25, 2025
మేధా పాట్కర్ అరెస్ట్

సామాజిక కార్యకర్త మేధాపాట్కర్‌ను పరువునష్టం కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. 2000లో ‘నర్మదా బచావో’ ఆందోళనకు వ్యతిరేకంగా ప్రస్తుత LG VK సక్సేనా ప్రకటనలు ప్రచురించారని ఆరోపిస్తూ ఆయనపై పాట్కర్ కేసు వేశారు. అదే సమయంలో ఓ ఇంటర్వ్యూలో తన పరువుకు భంగం కలిగించేలా మాట్లాడారని ఆమెపై సక్సేనా సైతం పరువు నష్టం దావా వేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఇటీవల ఆమెకు కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
News April 25, 2025
నరసరావుపేటలో రూ.10 కోట్ల భారీ స్కామ్..!

నరసరావుపేట, విజయవాడలో ఇటీవల వెలుగు చూసిన సినీ యానిమేషన్ స్కామ్‌లో నగరానికి చెందిన పలువురు రైల్వే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు భారీగా మోసపోయారు. స్కామ్ నిర్వాహకుడు కిరణ్‌కు వీరంతా రూ.10 కోట్ల వరకు ముట్టచెప్పినట్లు తెలుస్తోంది. అతడు దేశం వదిలి పారిపోయాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసును ప్రభుత్వం CIDకి అప్పగించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
News April 25, 2025
విజయవాడ: రూ.10 కోట్ల భారీ స్కామ్..!

విజయవాడ, నరసరావుపేటలో ఇటీవల వెలుగు చూసిన సినీ యానిమేషన్ స్కామ్‌లో నగరానికి చెందిన పలువురు రైల్వే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు భారీగా మోసపోయారు. స్కామ్ నిర్వాహకుడు కిరణ్‌కు వీరంతా రూ.10 కోట్ల వరకు ముట్టచెప్పినట్లు తెలుస్తోంది. అతడు దేశం వదిలి పారిపోయాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసును ప్రభుత్వం CIDకి అప్పగించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.