News February 1, 2025

MBNR: బి-ఫార్మసీ పరీక్షలు ప్రారంభం

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలో బి-ఫార్మసీ సెమిస్టర్-3 పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీ ఫార్మసీ కాలేజీలో ఉన్న పరీక్ష కేంద్రాన్ని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ చెన్నప్ప, ఓఎస్డీ మధుసూదన్ రెడ్డితో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. బార్కోడ్స్‌పై వివరాలు సరిచూసుకోవాలని, పరీక్షల ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.

Similar News

News July 7, 2025

NZB: అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా గాంధారి నరసింహారెడ్డి

image

నిజామాబాద్ మొదటి జిల్లా కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా గాంధారి నరసింహారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని అనంతగిరికి చెందిన నర్సింహారెడ్డి ఇంటర్మీడియట్ విద్యను ఖిల్లా కళాశాలలో, డిగ్రీ, లా ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు. అనంతరం నిజామాబాద్ జిల్లా కోర్టులో సుదీర్ఘకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు.

News July 7, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

image

బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹540 తగ్గి ₹98,290కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹500 తగ్గి ₹90,100 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేట్ రూ.1,20,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News July 7, 2025

నేడు భద్రాద్రి జిల్లాలో తుమ్మల పర్యటన

image

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం భద్రాద్రి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు అశ్వాపురం మండలం బి.జి. కొత్తూరులో మర్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పరిశీలిస్తారు. 3.30 గంటలకు భద్రాచలం అంబేద్కర్ సెంటర్‌లో డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 4.30 గంటలకు కొత్తగూడెం ఐడీఓసీలో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు.