News March 29, 2024

MBNR: బీఆర్ఎస్ MLC అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ భయం..!

image

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ రెడ్డి విజయంపై ధీమాతో ఉన్నప్పటికీ లోలోపల మాత్రం క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది. క్యాంపులకు వెళ్లిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నిజాయితీగా ఓటు వేశారా లేదంటే క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారా అనే అంశంపై నాయకులు తర్జనభర్జన పడుతున్నారు. విజయం సాధించాలంటే దాదాపు 725 ఓట్లు రావాల్సి ఉంది. ఫలితం కోసం ఏప్రిల్ 2 వరకు ఆగాల్సిందే.

Similar News

News October 4, 2024

12న పాలమూరుకి సీఎం రేవంత్ రెడ్డి

image

దసరా పండుగకు సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరికి రానున్నారు. ఈనెల 12న దసరా పండుగ సందర్భంగా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామానికి చేరుకొని అక్కడ వేడుకలలో పాల్గొంటారు.. అదేవిధంగా గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తారు. సీఎం రాక సందర్భంగా కొండారెడ్డిపల్లి గ్రామాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రతి ఏడాది దసరాను రేవంత్ రెడ్డి ఇక్కడే జరుపుకుంటారు.

News October 4, 2024

రేపు మన్ననూరులో గద్దర్ విగ్రహవిష్కరణ

image

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని మన్ననూరు గ్రామంలో రేపు గద్దర్ విగ్రహవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మరియు పలువురు బహుజన మేధావులు హాజరు అవుతారన్నారు. ఏపూరి సోమన్న బృందంతో సాంసృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

News October 4, 2024

సంగాల చెరువులో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే

image

గద్వాల మండలంలోని సంగాల చెరువులో శుక్రవారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి నీటిలో చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మత్స్యకారుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అదేవిధంగా ఈ ఏడాది నియోజకవర్గంలో ప్రతి చెరువుకు ప్రభుత్వం నుంచి చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు.