News August 20, 2025
MBNR: బీ-ఫార్మసీ ఫలితాలు.. UPDATE

పాలమూరు విశ్వవిద్యాలయంలో బీ-ఫార్మసీ 8వ సెమిస్టర్ రెగ్యులర్, 1, 3, 5,&7 బ్యాక్ లాక్ పరీక్ష ఫలితాలను బుధవారం యూనివర్సిటీ ఉపకులపతి(VC) ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్ విడుదల చేశారు.
✒8th సెమిస్టర్ రెగ్యులర్-82.74% పాస్
✒7th సెమిస్టర్ బ్యాక్ లాక్-71.43% పాస్
✒5th సెమిస్టర్ బ్యాక్ లాక్-50% పాస్
✒3rd సెమిస్టర్ బ్యాక్ లాక్-54.55% పాస్
✒1st సెమిస్టర్ బ్యాక్ లాక్-58.33% పాస్
Similar News
News March 30, 2026
KMR: అత్తను హతమార్చిన కోడలు.. 24 గంటల్లో ఛేదించిన పోలీసులు

గాంధారి మండలం సీతాయిపల్లిలో రుక్మవ్వ(73) హత్య కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. బంగారం, డబ్బుల కోసం కోడలు కోటవ్వ తన అత్తను బండతో కొట్టి చంపినట్లు విచారణలో తేలింది. హత్య అనంతరం ఏమీ తెలియనట్లు డ్రామా ఆడింది. పోలీసుల విచారణలో నిజం తేలింది. నిందితురాలి నుంచి 15 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ బృందాన్ని SP రాజేశ్ చంద్ర అభినందించారు.
News March 30, 2026
US స్థావరాలపై దాడుల్లో ఇరాన్‌కు రష్యా సహకారం: జెలెన్‌స్కీ

సౌదీ అరేబియాలోని US స్థావరాలపై ఇరాన్ చేపట్టిన దాడి వెనుక రష్యా సహకారం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. ఇరాన్‌కు రష్యా 100% సహకరిస్తోందన్నారు. మార్చి 20, 23, 25 తేదీల్లో సౌదీలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ శాటిలైట్ చిత్రాలను రష్యా క్యాప్చర్ చేసిందని తెలిపారు. ఒకటి కన్నా ఎక్కువసార్లు అలా శాటిలైట్ ఇమేజెస్‌ను రష్యా సాధారణంగా సేకరించదని పేర్కొన్నారు.
News March 30, 2026
నిజామాబాద్: తొలి ముద్దతో పోషక విప్లవం..!

చిన్నారుల ఆరోగ్యమే పరమావధిగా ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. జిల్లావ్యాప్తంగా ఉన్న సుమారు 3,120 అంగన్‌వాడీ కేంద్రాల్లో త్వరలోనే ‘తొలి ముద్ద’ పథకం ద్వారా పౌష్ఠికహరంతో కూడిన అల్పాహారాన్ని అందించనుంది. ఈ నిర్ణయంతో దాదాపు 1.50 లక్షల మంది చిన్నారులకు ప్రయోజనం చేకూరనుంది. బలవర్ధకమైన ఆహారాన్ని అందించడం ద్వారా బాలల్లో వేధిస్తున్న పోషకాహార లోపాన్ని, రక్తహీనతను నివారించాలని సర్కార్ యోచిస్తోంది.


