News April 8, 2025
MBNR: బుడియా బాపు ప్రత్యేకత (1/2)

బుడియా బాపును బంజారా ప్రజలు దైవంగా ఆరాధిస్తారు. ఆయనను సేవ్యసాత్ అని కూడా పిలుస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గిరిజన తండాల్లో ఎక్కువగా పూజిస్తారు. బుడియా బాపు ఆలయం నల్గొండ జిల్లా రంగుండ్ల తండా గ్రామంలో ఉంది. బుడియా బాపును బంజారా ప్రజలు తమను తమ తండాలను అన్ని రకాల ఆపదల నుంచి రక్షించే దైవంగా నమ్ముతారు. ఆయనను ఆరాధించడం ద్వారా మంచి ఆరోగ్యం లభిస్తుందని,దీర్ఘకాలిక రోగాలు నయం అవుతాయని వారు విశ్వసిస్తారు.
Similar News
News April 17, 2025
శంఖవరం: చెప్పులు దండ వేసిన నిందితుడు అరెస్ట్

శంఖవరంలో అంబేడ్కర్ విగ్రహానికి అపచారం చేసిన వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం కోర్టులో హాజరు పరుస్తామని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు.నిందితుడి పేరు పడాల వాసు(20) అని అతను ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని డీఎస్పీ వెల్లడించారు. డీఎస్పీ ఆధ్వర్యంలో నలుగురు సీఐలు,10మంది ఎస్సైలు ,40 మంది సిబ్బంది సాంకేతికతతో అతన్ని పట్టుకున్నామని ఎస్పీ వారిని అభినందించారు.
News April 17, 2025
KMM: ఆంబోతు మృతి.. ఆ ఊరంతా తల్లడిల్లింది.!

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని తాళ్లపెంటకు చెందిన దేవుడి ఆంబోతు అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ ఊరంతా తల్లడిల్లింది. ఆ ఆంబోతును దేవుడి స్వరూపంగా భావిస్తూ గ్రామస్థులు ట్రాక్టర్‌పై వీధులలో మేళతాళాలు, కుంకుమ చల్లుతూ ఊరేగించారు. అనంతరం భక్తి శ్రద్దలతో సంప్రదాయబద్దంగా ఆంబోతుకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. మహిళలు, పెద్దలు, గ్రామస్థులు పాల్గొని, కన్నీటి పర్యాంతమయ్యారు.
News April 17, 2025
ఏలూరు: నేరం రుజుకావడంతో 5 ఏళ్ల జైలు

ఏలూరుకు చెందిన కాటుమల రవితేజ, దుర్గలకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఐదేళ్ల పాప, మూడేళ్ల బాబు ఉన్నారు. పెళ్లైన నాటి నుంచి భర్త తాగుడుకు బానిసై, పాప తనకు పుట్టలేదని తరచూ గొడవ పడేవాడని భార్య తెలిపింది. 2018 సెప్టెంబర్ 1న పాపను కడుపులో బలంగా తండ్రి తన్నడంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిందని, నేరం రుజువు కావడంతో 5 ఏళ్ల జైలు శిక్ష బుధవారం విధించినట్లు ఎస్పీ కిషోర్ తెలిపారు.