News April 18, 2024

MBNR: భానుడి భగభగలు.. ఎల్లో హెచ్చరికలు జారీ

image

రాగల 3 రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈనెల 20 నుంచి 23 వరకు కొన్ని చోట్ల అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వేడికి సంబంధించి ఎల్లో అలర్ట్ పరిధిలో ఉన్నామని ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు. అవసరమైతేనే బయటికి వెళ్లాలని, శిశువులు, పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు పలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

Similar News

News October 1, 2024

MBNR: జూ.అధ్యాపకుల ఎదురుచూపులు..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో డీఎస్సీలో ఎంపికైన వారికి ఈనెల 9న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేయనున్నారు. ప్రభుత్వం కేవలం 55 రోజుల్లో డీఎస్సీ ఫలితాలను వెల్లడించి 10 రోజుల్లో నియామక పత్రాలు అభ్యర్థులకు అందించనుంది. కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జూనియర్ అధ్యాపకుల భర్తీని పట్టించుకోవడంలేదని ఎంపికైన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియామక పత్రాల కోసం ఎంపికైన వారు ఎదురుచూస్తున్నారు.

News October 1, 2024

NRPT: డీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటిన తండ్రీకొడుకులు

image

డీఎస్సీ ఫలితాల్లో నారాయణపేట జిల్లా మరికల్‌ మండలం రాకొండ గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు సత్తాచాటారు. 50ఏళ్ల వయసులో రాకొండకు చెందిన జంపుల గోపాల్‌ తెలుగు పండిట్‌ కేటగిరిలో జిల్లాస్థాయిలో మొదటి ర్యాంకు, స్కూల్‌ అసిస్టెంట్ విభాగంలో మూడో ర్యాంకు పొందారు. ఆయన కుమారుడు భానుప్రకాశ్‌ నారాయణపేట జిల్లా స్థాయిలో గణితంలో స్కూల్‌ అసిస్టెంట్‌ 9వ ర్యాంకు సాధించారు. దీంతో తండ్రీకొడుకులకు ప్రశంసలు వెల్లువెత్తాయి.

News October 1, 2024

MBNR: సర్వం సిద్ధం.. నేటి నుంచి ధ్రువపత్రాల పరిశీలన

image

డీఎస్సీ పలితాలను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మెరుగైన ర్యాంకులు సాధించిన అభ్యర్థుల సర్టిఫికేట్స్ పరిశీలన నుంచి 5వ తేదీ వరకు జరగనుంది. ఇప్పటికే పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని, ఎంపికైన అభ్యర్ధుల ఫోన్ కు SMS/మెయిల్ ఐడీకి మెయిల్ ద్వారా సమాచారం అందిస్తామని, 1:3 నిష్పత్తిలో DEOల వెబ్ సైట్ లో ఉంచుతామని డీఈవోలు తెలిపారు.