News March 21, 2025

MBNR: భూముల అమ్మకాల నిర్ణయాన్ని విరమించుకోవాలి: ABVP

image

HCU యూనివర్సిటీల భూముల వేలాన్ని వెంటనే ఆపాలని పాలమూరు యూనివర్సిటీ ముందు ఈరోజు ఏబీవీపీ నిరసన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ ఆల్ యూనివర్సిటీ కో కన్వీనర్ కృష్ణ కుమార్ మాట్లాడుతూ.. ప్రజా పాలన అని చెప్పి అధికారంలోకొచ్చి విద్యావ్యవస్థను తుంగలో తొక్కిందన్నారు. తెలంగాణలోని యూనివర్సిటీల భూములను వేల వేయడం ప్రభుత్వానికి చేతగానితనం వారు విమర్శించారు.విద్యార్థులపై నిర్లక్ష్యం వహిస్తే నిరసన చేస్తామన్నారు.

Similar News

News March 21, 2025

మహబూబ్‌నగర్ బస్టాండ్ రద్దీ

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ శుక్రవారం రద్దీగా కనిపించింది. గురువారంతో ఇంటర్ పరీక్షలు పూర్తి కావడంతో కాలేజీ హాస్టల్స్‌లో ఉండే విద్యార్థులు, బయట రూంలు తీసుకొని చదువుకునే విద్యార్థులు ఖాళీ చేసి సొంతూళ్లకు బయలుదేరారు. వారితో పాటు తల్లిదండ్రులు కూడా రావడంతో బస్టాండ్ రద్దీగా కనిపించింది.

News March 21, 2025

మహబూబ్‌నగర్: మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు: ఎమ్మెల్యే 

image

పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత,మత సామరస్యానికి ప్రతీక అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం MBNRలోని జేజేఆర్ ఫంక్షన్ హాలులో జాఫర్ ఉల్లా సిద్దిక్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విరమింపజేశారు.

News March 21, 2025

MBNR: ‘సీఐటీయూ నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి’

image

కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీఐటీయూ తెలిపింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కురుమూర్తి శుక్రవారం మాట్లాడుతూ.. అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రధాన సమస్యలైన జీతాల పెంపు, పీఎఫ్, ఈఎస్ఐ బోనస్, గ్రాటిటి, పెన్షన్, లేబర్ కోడ్ రద్దు, కనీస వేతనాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.

error: Content is protected !!