News October 12, 2025

MBNR: మద్యం టెండర్లకు స్పందన కరువు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఈసారి మద్యం టెండర్లకు ఆశించిన స్పందన రాలేదు. గతంలో వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తే, ఈసారి గడువు సమీపిస్తున్నా వందల్లో కూడా దాటలేదు. 2023లో 8, 128 అప్లికేషన్లు వస్తే, ఇప్పటివరకు కేవలం 278 మాత్రమే అందాయి. దాంతో అధికారులు అప్లికేషన్ల సంఖ్య పెంచేందుకు గతంలో టెండర్లు వేసిన వారికి ఫోన్‌లు చేస్తున్నారు. మద్యం షాపుల టెండర్ ఫీజులను పెంచడమే వెనకడుగు వేసేందుకు కారణంగా తెలుస్తోంది.

Similar News

News October 11, 2025

MBNR: పాలమూరు యూనివర్సిటీలో మెగా ప్లేస్‌మెంట్ డ్రైవ్

image

పాలమూరు విశ్వవిద్యాలయంలో మెగా ప్లేస్‌మెంట్ డ్రైవ్‌ను తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొ.వి.బాలకిష్టా రెడ్డి హాజరై ప్రారంభించారు. ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహించడం ఇదే మొదటిసారి అన్నారు. ఉమ్మడి MBNR జిల్లా నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వీసీ ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్ బాబు సహా 148 మంది అభ్యర్థులు పాల్గొన్నారు.

News October 11, 2025

22 నుంచి కురుమూర్తి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

image

చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామంలో తెలంగాణ తిరుపతి (పేదల తిరుపతి)గా పిలువబడే కురుమూర్తి (వెంకటేశ్వర స్వామి) బ్రహ్మోత్సవాలు ఈ నెల 22నుంచి ప్రారంభమై, వచ్చేనెల 7వ తేదీ వరకు జరగనున్నాయి. 26న స్వామివారి అలంకరణ మహోత్సవం, 28న ఉద్దాల మహోత్సవం నిర్వహించనునట్లు ఆలయ ఛైర్మన్ గోవర్ధన్ రెడ్డి తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన అన్నారు.

News October 11, 2025

MBNR: యోగ.. సౌత్ జోన్ కు ఎంపికైంది వీళ్లే!

image

పాలమూరు యూనివర్సిటీలోని క్రీడా కాంప్లెక్స్ లో సౌత్ జోన్ లో పాల్గొనేందుకు యోగ ఎంపికలు నిర్వహించారు.
✒బాలికల విభాగం:సంగీత,పూజ,అంకిత, లక్ష్మి,సురేఖ,అన్నపూర్ణ
✒పురుషుల విభాగం: శ్రీనివాస్,ఉదయ్ కుమార్,నరేష్, శివశంకర్,సాయి చరణ్, సచిన్, ఈనెల 24 నుండి ప్రారంభమయ్యే టోర్నీలలో బాలికల జట్టు సవ్యసా యూనివర్సిటీ (బెంగళూరు), బాలుర జట్టు వెల్ యూనివర్సిటీ(చెన్నై)లో పాల్గొననున్నట్లు PD Dr.Y.శ్రీనివాసులు తెలిపారు.