News October 19, 2025

MBNR: మద్యం దుణాకాలను 5,142 దరఖాస్తులు

image

మద్యం దుకాణాల గడువును ప్రభుత్వం 23 వరకు పొడగించింది. నిన్న ఒక్కరోజే 2407 దరఖాస్తులు రావడం విశేషం. ఉమ్మడి జిల్లాలో 227 మద్యం దుకాణాలు ఉండగా ఇప్పటికి 5,142 వచ్చాయి. MBNR 1544, NGKL 1423, NRPT 779, GDWL 723, WNP 673 దరఖాస్తులు చేసుకున్నారు. ఈ నెల 27న కలెక్టర్ల సమక్షంలో డ్రా తీయనున్నారు. నాన్‌ రిఫండబుల్‌ విధానంలో ఒక్కో దరఖాస్తుకు రూ.3లక్షల ఫీజు ఉండటంతో దరఖాస్తులు రాలేదని పలువురు అంటున్నారు.

Similar News

News October 19, 2025

‘కాంతార’లో మెప్పించిన SRపురం వాసి

image

పాన్ ఇండియా మూవీ ‘కాంతార’లో SRపురం(M) పొదలపల్లికి చెందిన ఏకాంబరం నటించారు. ఇందులో భాగంగా తన నటనకు దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి మొచ్చకున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన్ను స్వగ్రామం గంగాధర నెల్లూరులో వైసీపీ నేత కృపాలక్ష్మి అభినందించారు. సినిమా రంగంలో మరింత ప్రతిభ చూపి గుర్తించ దగ్గ పాత్రలు పోషించాలని ఆమె ఆకాంక్షించారు.

News October 19, 2025

GNT: అత్యాచారం చేసి.. భయం లేకుండా బిర్యానీ తిన్నాడు.!

image

సత్రాంగచ్చి-చర్లపల్లి రైలులో ప్రయాణిస్తున్న మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుడు రాజారావును మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పోలీసుల విచారణలో అనేక విషయాలు వెలుగుచూశాయి. బాధితురాలి నుంచి లాక్కున్న ఫోన్ విక్రయించి బిర్యానీ తిన్నానని, గతంలో కేరళ మహిళపై కూడా ఇలానే అత్యాచారం చేశానని నిందితుడు ఒప్పుకున్నాడు. బాధితురాలి సిమ్‌ను తన ఫోన్‌లో వేయడంతో సిగ్నల్ ఆధారంగా పోలీసులు పట్టుకున్నారు.

News October 19, 2025

DRDOలో 50 పోస్టులు… అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

DRDO ఆధ్వర్యంలోని ప్రూప్& ఎక్స్‌పెరిమెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో 50 అప్రెంటిస్‌లకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. BE/బీటెక్, డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అకడమిక్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ/ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.12,300, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.10,900 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.isro.gov.in/