News December 28, 2024
MBNR: మన్మోహన్ సింగ్‌కు ఎమ్మెల్యేల నివాళులు
భారత మాజీప్రధాని మన్మోహన్ సింగ్‌కు శనివారం ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు ఘన నివాళులర్పించారు. MBNRలోని మూఢ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మన్మోహన్ సింగ్ చిత్రపటానికి ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మూడ ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.
Similar News
News December 29, 2024
నల్లమలలో టెంపుల్, ఎకో, రివర్ టూరిజానికి ప్రయారిటీ
నల్లమల, కృష్ణా నది తీరంలో టెంపుల్, ఎకో, రివర్ టూరిజం అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. రూ.65 కోట్లతో ఈ ప్రాంతాల అభివృద్ధికి ప్లాన్ చేయగా అత్యధికంగా సోమశిలకు కేటాయించారు. నల్లమలలోని అక్కమహాదేవి గుహలు మొదలుకుని సలేశ్వరం, మల్లెల తీర్థం, లొద్దిమల్లయ్య, మద్దిమడుగు, ఆక్టోపస్, ఫర్హాబాద్ వ్యూ పాయింట్, ప్రతాపరుద్రుడి కోట అభివృద్ధికి రూ.25 కోట్లతో ప్రపోజల్స్ సిద్ధం చేస్తున్నట్లు MLA వంశీకృష్ణ తెలిపారు.
News December 29, 2024
పాలమూరు టెట్ అభ్యర్థులకు తప్పని తిప్పలు !
ఉమ్మడి పాలమూరు జిల్లా టెట్ అభ్యర్థులకు మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలో పరీక్షా కేంద్రాలను కేటాయించారు. వచ్చే నెల 2-20 మధ్య తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దరఖాస్తు సమర్పించే సమయంలో 16 కేంద్రాలను ఎంపిక చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. తొలి ప్రాధాన్యత ఆధారంగా ఇచ్చిన జిల్లాలో కాకుండా చివరి ప్రాధాన్యతలో దూరంగా ఉన్న ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను కేటాయించారు.
News December 29, 2024
MBNR: 19,852,867 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 9,41,395 రేషన్ కార్డులు ఉన్నాయి. డీలర్లు ప్రతి నెల 19,852,867 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా అర్హత ఉన్నా లబ్ధిదారులు నూతన రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. MBNR-739, NGKL-573, GDWL-351, NRPT-301, WNPT-328 చౌకధర దుకాణాలు ఉన్నాయి. ప్రభుత్వం ఒక్కో లబ్దిదారుడికి ఆరు కిలోల బియ్యం మంజూరు చేస్తోంది.