News August 13, 2025
MBNR : మహమ్మదాబాద్‌లో అత్యధిక వర్షపాతం నమోదు

MBNR జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మహమ్మదాబాద్ 14.3మి.మీ. వర్షపాతం రికార్డు అయింది. మహబూబ్ నగర్ అర్బన్, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 7.0, హన్వాడ 6.8, కోయిలకొండ మండలం పారుపల్లి 6.0, భూత్పూర్ 5.0, అడ్డాకుల 4.5, , మిడ్జిల్ 4.3, నవాబుపేట 4.0, చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్, బాలానగర్ 3.8, కౌకుంట్ల 3.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
Similar News
News August 14, 2025
మత్తుకు బానిసలు కావొద్దు: ఎస్పీ జానకి

విద్యార్థులు చెడు వ్యసనాలు, మత్తుకు అడిక్ట్ కావొద్దని MBNR ఎస్పీ డి.జానకి సూచించారు. ధర్మాపూర్‌లోని బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. చదువుకునే క్రమంలో విద్యార్థులు చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. చెడు స్నేహాలు, వ్యసనాలతో విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని అన్నారు. సీఐ శ్రీనివాస్, ఏఎస్ఐ జయరాణి పాల్గొన్నారు.
News August 13, 2025
MBNR: దివ్యాంగుల ప్రజావాణికి 19 ఫిర్యాదులు

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన వృద్ధులు, దివ్యాంగుల ప్రజావాణికి 19 ఫిర్యాదులు వచ్చినట్టు కలెక్టర్ విజయేందిర బోయి వెల్లడించారు. వృద్ధులు, దివ్యాంగుల నుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని జరీనా బేగం, తదితరులు పాల్గొన్నారు.
News August 12, 2025
MBNR: పోలీసులు కాంగ్రెస్ కు వంత పాడుతున్నారు: MP

రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌కి పోలీసులు వంత పడుతున్నారని ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావును మంగళవారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంపై ఆమె స్పందించారు. అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని ఖండించారు. హర్ ఘర్ తిరంగా దేశభక్తి కార్యక్రమంలో భాగంగా పెద్దమ్మ గుడిలో పూజలకు వెళుతుంటే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ దురాహంకారం, దౌర్జన్యానికి ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు.