News February 27, 2025

MBNR: మహిళపై దాడి.. చికిత్స పొందుతూ మృతి

image

ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన భూత్పూర్ మండలంలో జరిగింది. పోలీసుల వివరాలు.. మండలంలోని కొత్త మోల్గర గ్రామానికి చెందిన రంగమ్మ (50) మంగళవారం ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ముని రంగస్వామి దేవాలయ వద్ద ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయగా రక్తపుమడుగులో కొట్టుమిట్టాడింది. గమనించిన స్థానికులు పోలీసులకు తెలపగా MBNR ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందిందని పోలీసులు తెలిపారు.

Similar News

News September 16, 2025

TTD టోకెన్ల జారీలో మార్పు

image

TTD అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపులో మార్పు చేశారు. ఇప్పటివరకు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ విధానం ఉండగా, ఇకపై లక్కీడిప్ పద్ధతిలో ఇవ్వనున్నారు. 3నెలల ముందుగా ఆన్‌లైన్ ద్వారా లక్కీ డిప్‌లో టోకెన్లు విడుదల చేస్తారు. డిసెంబర్ అంగప్రదక్షిణ టోకెన్ల కోసం సెప్టెంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రోజూ 750 టోకెన్లు (శుక్రవారం మినహా) ఉంటాయి.

News September 16, 2025

తిరుపతి: భయపెడుతున్న ‘కిడ్నీ’ భూతం

image

తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం పాలెంపాడు గ్రామాన్ని కిడ్నీ భూతం భయపెడుతోంది. దాదాపు 100 మంది వరకు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. గ్రామానికి చెందిన సగిలాల వెంకటేశ్వర్లు(32) తిరుపతిలో డయాలసిస్ చేయించుకుంటూ సోమవారం మృతిచెందారు. ఈ గ్రామంలోని కిడ్నీ బాధితులంతా నిరుపేదలే. ఎప్పుడు ఎవరు చనిపోతారో తెలియక ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని భయం భయంగా జీవిస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

News September 16, 2025

ప్రతి రైతుకు యూరియా అందే విధంగా చూడాలి: కలెక్టర్

image

ప్రతి రైతుకు యూరియా అందే విధంగా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సూచించారు. మరిపెడ PACS పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. సొసైటీ వద్దకు వచ్చిన రైతులకు నీడ, మంచి నీటి వసతులు కల్పించాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా పంపిణీ చేయాలని సూచించారు. యూరియా సరఫరా చేస్తున్న ప్రక్రియను పారదర్శకంగా అమ్మకాల రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు.