News November 13, 2025
MBNR: మహిళలకు ఉచిత శిక్షణ.. నేడే లాస్ట్!

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని గ్రామీణ మహిళలకు SBI, RSETI ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ జి.శ్రీనివాస్ ‘Way2News’కు తెలిపారు. లేడీస్ టైలరింగ్ కోర్సులలో ఈనెల 14 నుంచి ఉచిత శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. వయసు 19-45 లోపు ఉండాలని, SSC MEMO, రేషన్, ఆధార్ కార్డ్, కుల ధ్రువీకరణ పత్రం, 3 ఫొటోలతో ఈనెల 13లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వివరాలకు 99633 69361 సంప్రదించాలన్నారు.
#SHARE IT
Similar News
News November 13, 2025
అమలాపురం: వ్యభిచార గృహంపై దాడి

అమలాపురంలో పట్టాభి స్ట్రీట్‌లో ఓఇంట్లో వ్యభిచారం సాగుతోందని పోలీసులు గుర్తించారు. కొంతమంది అండతో పాయసం వెంకట రమణ ఇద్దరు అమ్మాయిలతో ఈ వ్యాపారం నిర్వహిస్తోందని సమాచారంతో సీఐ వీరబాబు బుధవారం రాత్రి దాడి చేశారు. ఇద్దరు అమ్మాయిలతో పాటు నలుగురు విటులు అదుపులోకి తీసుకోగా, 2 వేల నగదు, 5 కండోమ్‌లను స్వాధీనం చేసుకున్నారు. అయిదుగురిని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు టౌన్ సీఐ వీరబాబు గురువారం తెలిపారు.
News November 13, 2025
జూబ్లీహిల్స్: రేపు వైన్స్ బంద్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో రేపు ఉదయం నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలు బంద్ ఉంటాయని అధికారులు మరోసారి గుర్తు చేశారు. వైన్స్, బార్‌లు, కల్లు కంపౌండ్‌లు మూసివేయాలని ఆదేశించారు. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ ప్రక్రియ ఉన్నందున పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. కౌంటింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం వైన్స్ తెరుచుకోనున్నాయి. SHARE IT
News November 13, 2025
వరంగల్ బస్టాండ్ వద్ద బీజేపీ వినూత్న నిరసన

వరంగల్ కొత్త బస్టాండ్ నిర్మాణ పనులు నిలిచిపోయిన నేపథ్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఆధ్వర్యంలో గురువారం వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. ‘వరంగల్ బస్టాండ్‌లో పడవ ప్రయాణం- కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులకు ఉచితం’ అనే శీర్షికతో చేపట్టిన ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న బస్టాండ్ వద్ద జరగనుంది. మీడియా మిత్రులను పాల్గొనాలని ఆహ్వానించారు.


