News March 11, 2025

MBNR: మహిళలకు ఉచిత శిక్షణ.. APPLY చేసుకోండి..!

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మహిళలకు “SBI, SBRSETI” ఆధ్వర్యంలో ఉపాధి రంగాల్లో నెల రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ జీ.శ్రీనివాస్ తెలిపారు. Way2Newsతో ఆయన మాట్లాడుతూ.. బ్యూటీపార్లర్ కోర్సులో ఈనెల 13లోగా SSC MEMO, ఆధార్, రేషన్ కార్డులతో దరఖాస్తులు చేసుకోవాలని, ఉచిత శిక్షణ, భోజనం, వసతి ఉంటుందన్నారు. వయస్సు 19-45 ఏళ్లలోపు ఉండాలన్నారు.

Similar News

News November 10, 2025

నిజామాబాద్: ప్రజావాణిలో 16 ఫిర్యాదులు స్వీకరించిన సీపీ

image

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా నిజమాబాద్ సీపీ సాయి చైతన్య సోమవారం ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ మేరకు కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో 16 ఫిర్యాదులను స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. సీపీ మాట్లాడుతూ.. ప్రజలు నిర్భయంగా తమ ఫిర్యాదులను అందించవచ్చని సూచించారు.

News November 10, 2025

స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తాం: కలెక్టర్

image

అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలపై అర్జీదారుల నుంచి కలెక్టర్ ఆనంద్ అర్జీలను స్వీకరించారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ జరిపి త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. సమస్యల పరిష్కారంపై నిరంతర సమీక్ష ఉంటుందని వివరించారు.

News November 10, 2025

జూబ్లీహిల్స్‌ బైపోల్.. ఎన్ని పనులున్నా ఓటేసి వెళ్లండి..!

image

గుర్తుందా.. రేపు నవంబర్ 11.. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక జరిగే రోజు.. మీకు ఎన్ని పనులున్నా.. మీరు ఎంత బిజీ ఉన్నా.. రేపు మాత్రం ఓటేసిన తరువాతే పనులు చూసుకోండి..”ముఖ్యమైన పనులున్నాయి.. వీలుకాదు.. మన ఒక్క ఓటు వేయకపోతే ఏమవుతుంది” అని అనుకోకండి.. అందరూ ఇలా అనుకుంటే ఇక ఓట్లు ఎవరు వేస్తారు? పనులు అందరికీ ఉంటాయి.. అవసరమైతే వాయిదా వేసుకోండి.. ఓటు వేయండి.. ప్లీజ్‌.