News August 29, 2025
MBNR: మహిళలకు ఉచిత శిక్షణ.. APPLY చేసుకోండి..!

SBI, కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ (SBI RSETY) ఆధ్వర్యంలో ఉమ్మడి MBNR జిల్లా గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ కల్పిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ ఈరోజు తెలిపారు. ఉచిత బ్యూటిషన్, ఎంబ్రాయిడరీలకు ఆగస్టు 31వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. పూర్తి వివరాలకు MBNR బండమీదిపల్లిలోని SBI RSETY సెంటర్‌లో లేదా 99633 69361, 95424 30607 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
Similar News
News August 29, 2025
NLG: బత్తాయి తోటను పరిశీలించిన రైతు కమిషన్ బృందం

నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామాన్ని శుక్రవారం తెలంగాణ రైతు కమిషన్ సభ్యుల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా గ్రామంలోని బత్తాయి తోటను పరిశీలించి రైతు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జాలిపర్తి నాగేశ్వరావు అనే రైతు బత్తాయి తోటలో రాలిన కాయలను కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, కమిటీ సభ్యులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో లకుమాల మధుబాబు తదితరులు పాల్గొన్నారు.
News August 29, 2025
కడప: వినాయక నిమజ్జనంలో అపశృతి

కడప జిల్లాలో వినాయక నిమజ్జన కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. బాణాసంచా పేలి నలువురికి గాయాలయ్యాయి. బ్రహ్మంగారిమఠం మండలం రేకలగుంట పంచాయతీ బాగాది పల్లెలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాణసంచా పేలి గ్రామానికి చెందిన పాల కొండయ్య, జగదీశ్, లోకేశ్, దుక్కేశ్ గాయపడ్డారు. గాయపడిన వారిని 108లో బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News August 29, 2025
సిద్దిపేట: ‘ఎన్నికలు సజావుగా సాగేలా సహకరించండి’

స్థానిక ఎన్నికలు సజావుగా సాగేలా సహకరించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కలెక్టర్ కె. హైమావతి కోరారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హల్‌లో జిల్లాలో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 508 గ్రామ పంచాయతీల్లో 4508 పోలింగు స్టేషన్లలో 1 జూలై 2025 వరకు 6,55,958 ఓటర్లు ఉన్నారన్నారు. ఈ 508 గ్రామ పంచాయతీలలో ఓటర్ లిస్టు విడుదల చేస్తామని చెప్పారు.