News February 19, 2025
MBNR: మహిళలకు గుడ్ న్యూస్.. ఉచిత శిక్షణ

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మహిళలకు “SBI, SBRSETI” ఆధ్వర్యంలో ఉపాధి రంగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ G.శ్రీనివాస్ తెలిపారు. Way2Newsతో ఆయన మాట్లాడుతూ.. ఎంబ్రాయిడరీ డిజైన్ లలో ఈనెల 24 నుంచి 30 రోజుల పాటు ఉచిత శిక్షణ, భోజనం, వసతి ఉంటుందన్నారు. SSC MEMO, ఆధార్, రేషన్ కార్డులతో దరఖాస్తులు చేసుకోవాలని, 19-45 సం.లలోపు ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు 95424 30607కు సంప్రదించాలన్నారు.
Similar News
News February 20, 2025
MBNR: సేవాలాల్ జయంతి వేడుకల్లో ఎంపీ

హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఎస్టీ మోర్చ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సంత్ సేవాలాల్ భోగ్ బండార్ హోమం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజనుల ఆరాధ్య దైవం, హిందూ ధర్మ పరిరక్షకుడు సంత్ సేవాలాల్ మహరాజ్ అని అన్నారు. సేవాలాల్ జయంతిని ఫిబ్రవరి 15న దేశ వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని పార్లమెంట్లో తెలిపినట్లు చెప్పారు.
News February 20, 2025
రాష్ట్రంలోనే చదువుల నిలయం మన పాలమూరు: MLA యెన్నం

తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు మహబూబ్‌నగర్ చదువుల కేంద్రం కావాలి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పట్టణంలోని పంచవటి విద్యాలయ 21వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చదువుకోవడానికి మన మహబూబ్‌నగర్‌కే రావాలన్నారు. పంచవటి విద్యాలయ యాజమాన్యం విద్యా నిధికి రూ.5 లక్షలు అందజేశారు.
News February 20, 2025
మన్యంకొండ హుండీ ఆదాయం రూ.32,39,301

మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి హుండీలను బుధవారం ఆలయ అధికారులు లెక్కించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు లెక్కింపు కొనసాగింది. ఆలయం నిర్వహణ అధికారి శ్రీనివాసరాజు పర్యవేక్షణలో లెక్కింపు చేపట్టారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి హుండీ ఆదాయం రూ.32,39,301 వచ్చినట్లు ఆలయ ధర్మకర్త అళహరి మధుసూదన్ కుమార్ తెలిపారు.