News February 19, 2025
MBNR: మహిళలకు గుడ్ న్యూస్.. ఉచిత శిక్షణ

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మహిళలకు “SBI, SBRSETI” ఆధ్వర్యంలో ఉపాధి రంగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ G.శ్రీనివాస్ తెలిపారు. Way2Newsతో ఆయన మాట్లాడుతూ.. ఎంబ్రాయిడరీ డిజైన్ లలో ఈనెల 24 నుంచి 30 రోజుల పాటు ఉచిత శిక్షణ, భోజనం, వసతి ఉంటుందన్నారు. SSC MEMO, ఆధార్, రేషన్ కార్డులతో దరఖాస్తులు చేసుకోవాలని, 19-45 సం.లలోపు ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు 95424 30607కు సంప్రదించాలన్నారు.
Similar News
News February 27, 2026
విజయవాడ: లాడ్జిలలో వ్యభిచారం

విజయవాడలోని గవర్నర్ పేటలో లాడ్జిపై పోలీసులు దాడి చేశారు. ఓ లాడ్జీలో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న స్థానికుల సమాచారం మేరకు గురువారం సాయంత్రం దాడి చేశారు. ఇద్దరు విఠులను అరెస్ట్ చేసి నలుగురు మహిళలను వ్యభిచార కూపం నుంచి విడిపించినట్లు సీఐ నాగమురళి తెలిపారు. కోర్టు ఉత్తర్వులు ప్రకారం మహిళలను సంరక్ష కేంద్రానికి పంపించామన్నారు.
News February 27, 2026
సూసైడ్ గురించి సెర్చ్ చేస్తే పేరెంట్స్‌కు అలర్ట్

పిల్లలు సూసైడ్ లేదా సెల్ఫ్-హార్మ్ వంటి పదాలతో ఇన్‌స్టాలో సెర్చ్ చేస్తే.. వెంటనే పేరెంట్స్‌కు అలర్ట్ వెళ్లేలా కొత్త ఫీచర్ వచ్చింది. పేరెంట్స్ సూపర్విజన్ టూల్స్ వాడుతున్న వారికి ఈ నోటిఫికేషన్లు వాట్సాప్ లేదా SMS రూపంలో వెళ్తాయి. ప్రస్తుతం US, UK వంటి దేశాల్లో మొదలైన ఈ ఫీచర్ 2026 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. పిల్లలను కౌన్సెల్ చేసేలా నిపుణుల సలహాలనూ ఇన్‌స్టా అందిస్తుంది.
News February 27, 2026
బాన్సువాడ: దొంగల మూఠా అరెస్ట్

విద్యుత్ ట్రాన్స్‌ఫార్మల నుంచి కాపర్, ఆయిల్ చోరికి పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బాన్సువాడ DSP విఠల్ రెడ్డి వివరాల ప్రకారం.. పలు గ్రామాల్లో దుండగులు ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్, ఆయిల్ చోరికి పాల్పడుతున్నారు. దర్యాప్తు చేపట్టి నిందితులు సుభాష్, కరీం, సురేఖఅర్జున్ తాంబే, సునీల్ శ్యామ్ రావు వాగ్మారేను గురువారం అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.


