News March 22, 2025

MBNR: మహిళలకు న్యాయసేవలు: జిల్లా న్యాయ సేవ

image

పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ పరిష్కార చట్టం-2013 చట్టంపై మహిళలందరికీ అవగాహన అవసరమని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మహిళ ఉద్యోగినులతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. మహిళలు పని చేసే కార్యాలయంలో వారిపై లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించేందుకే కేంద్రం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు.

Similar News

News March 22, 2025

MBNR: నిరుద్యోగ యువతకు తప్పని సమస్య..!

image

నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాస్ పథకం కింద లబ్ధిపొందేందుకు రేషన్ కార్డు లేకపోవడం ప్రధాన సమస్యగా మారిందని పలువురు అంటున్నారు. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసినప్పటికీ, పాత రేషన్ కార్డు తొలగించాల్సిన నిబంధనతో సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. పెళ్లయిన వారు తల్లిదండ్రుల రేషన్ కార్డుల్లోనే కొనసాగుతుండడంతో కొత్త కార్డు పొందడానికి సమస్య ఎదురవుతోందని, దీంతో పథకానికి అప్లై చేయని పరిస్థితి నెలకొందన్నారు.

News March 22, 2025

ట్రాన్స్‌జెండర్ MURDER.. మహబూబ్‌నగర్‌లో నిరసన

image

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ట్రాన్స్‌జెండర్ హత్యకు నిరసనగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ట్రాన్స్‌జెండర్లు శుక్రవారం నిరసన తెలిపారు. ట్రాన్స్‌జెండర్ల అధ్యక్షురాలు సుకన్య మాట్లాడుతూ.. ట్రాన్స్‌జెండర్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష మాని, తమ సంక్షేమానికి కృషి చేయాలన్నారు. ట్రాన్స్‌జెండర్ హత్యకు కారణమైన నిందితుడిని ఉరితీసి చట్టపరమైన చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

News March 22, 2025

MBNR: ‘పల్లెల్లో అడుగంటిన అభివృద్ధి’

image

పాలమూరులో గడచిన 14 నెలలుగా గ్రామాల్లో స్థానిక సంస్థలకు ప్రజాప్రతినిధులు లేకపోవటంతో ప్రజలకు సేవలు అందించేందుకు ప్రతి గ్రామ పంచాయతీకి ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి తెచ్చింది. గత 14 నెలలుగా పల్లెల్లో అభివృద్ధి అడుగంటి పోయిందనే ఆరోపణలు వస్తున్నాయి. నిధులు లేకపోవడంతో వీధి దీపాల ఏర్పాటు,పారిశుద్ధ్యం, మురుగు, తాగునీటి సరఫరా వంటి ప్రధాన సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. 

error: Content is protected !!