News March 25, 2024

MBNR: మహిళా సంఘాలకు రూ.25.73 కోట్లు మంజూరు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మహిళా సంఘాలకు ఊరట లభించింది. ప్రభుత్వం వారి ఖాతాల్లో కొన్ని నెలలకు సంబంధించిన వడ్డీ నగదును మంజూరు చేసింది. ఉమ్మడి జిల్లాకు రూ.25.73 కోట్లు మంజూరు కాగా నేరుగా స్వయం సహాయక సంఘాల సేవింగ్ ఖాతాల్లో ఈ నిధులను జమ చేస్తున్నారు. అయితే మొత్తం కాకుండా కేవలం మూడు నెలలకు సంబంధించిన రాయితీని మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది.

Similar News

News March 6, 2026

MBNR: ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక విజయవంతం చేయాలి

image

ప్రజా పాలని -ప్రగతి ప్రణాళిక విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజానర్సింహా పిలుపునిిచ్చారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఐడీఓసీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 6 తారీకు నుంచి జూన్ 12 వరకు ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. 99 రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తదితరులు పాల్గొన్నారు.

News March 6, 2026

MBNR: యుద్ధం ఎఫెక్ట్.. పడిపోయిన కోడిగుడ్ల ధరలు!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కోడిగుడ్ల ధరలు రోజురోజుకు పడిపోతున్నాయి. NECC ఒక్క గుడ్డు ధర 4.30 ఉన్నప్పటికీ.. డిమాండ్ లేకపోవడంతో.. గుడ్డు ధర రూ.3.50 మాత్రమే పలుకుతోంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతుండడంతో కోడిగుడ్ల ఎగుమతి లేదని పౌల్ట్రీ ఫారం యజమానులు అన్నారు. యుద్ధం వల్ల ఎగుమతి లేకపోవడంతో నిల్వలు పెరిగాయన్నారు. యుద్ధం ఇలాగే కొనసాగితే పౌల్ట్రీ ఫారం రైతులు తీవ్రంగా నష్టపోతామన్నారు.

News March 6, 2026

MBNR: అధిక ఎండలు.. ప్రజల బెంబేలు

image

మహబూబ్ నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో.. చిన్న చింతకుంట మండలం నంది వడ్డేమాన్‌లో, కోయిలకొండ మండలం పారుపల్లిలో 38.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. భూత్పూర్ 38.4, చిన్న చింతకుంట 38.1, అడ్డాకుల 38.0, మిడ్జిల్ మండలం కొత్తపల్లి, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 37.9, కౌకుంట్ల, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్, మూసాపేట మండలం జానంపేట 37.8, దేవరకద్ర 37.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.