News March 24, 2025

MBNR: మాజీ మంత్రి VS MLA.. తగ్గేదేలే..!

image

మహబూబ్‌నగర్‌లో రాజకీయం నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. ఓ వైపు మాజీ మంత్రి, BRS మాజీ MLA శ్రీనివాస్ గౌడ్ నియోజకవర్గంలో ముమ్మరంగా పర్యటిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఫైర్ అవుతున్నారు. 14 నెలల్లో రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఆగం చేసిందంటున్నారు. మరోవైపు MLA యెన్నెం శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టారు. అప్పులు చేసి ఆగం చేసింది BRS వాళ్లే అని కౌంటర్ ఇస్తున్నారు. మీ కామెంట్?

Similar News

News March 26, 2025

నేషనల్ కబడ్డీ పోటీలకు MBNR జిల్లావాసి ఎంపిక

image

34వ నేషనల్ సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం తిమ్మాయిపల్లి తండాకు చెందిన జై సురేశ్ ఎంపికయ్యారు. ఈనెల 27వ తేదీ నుంచి 31 తేదీ వరకు బిహార్‌లోని గయాలో నిర్వహించనున్న పోటీలలో సురేష్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శాంతికుమార్, జనరల్ సెక్రెటరీ కురుమూర్తి గౌడ్, ఉపాధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, దామోదర్ రెడ్డి తదితరులు సురేశ్‌ను అభినందించారు.

News March 26, 2025

MBNR: 1052 మంది రక్తదానం చేశారు: నటరాజు

image

షహీద్ దివస్‌ను పురస్కరించుకుని మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా వివిధ సంస్థలు, కళాశాలలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాల్లో మొత్తం 1052 మంది యువత రక్తదానం చేశారని ఐఆర్‌సీఎస్ ఛైర్మన్ నటరాజు ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ నెల 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రక్తదాన శిబిరాలను నిర్వహించగా.. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారని తెలిపారు.

News March 26, 2025

MBNR: ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: ఎస్పీ  

image

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా గంజాయి, కల్తీ కల్లు నిర్మూలనకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో తరఫున ప్రచార కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మహబూబ్ నగర్ జిల్లాఎస్పీ డి. జానకి, ప్రత్యేకంగాతెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో వారు రూపొందించిన గంజాయి & కల్తీకల్లు నిర్మూలన పోస్టర్‌ను విడుదల చేశారు. ఎస్పీ మాట్లాడుతూ యువత, ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అన్నారు.

error: Content is protected !!