News March 12, 2026

MBNR: మినీ ఎయిర్‌పోర్టుల్లా రైల్వే స్టేషన్లు..!

image

‘అమృత్ భారత్ స్టేషన్’ పథకం కింద ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని రైల్వే స్టేషన్లు సరికొత్త రూపు సంతరించుకుంటున్నాయి. మహబూబ్‌నగర్ (₹39.82 కోట్లు), జడ్చర్ల (₹36.67 కోట్లు), గద్వాల (₹42.82 కోట్లు), జోగులాంబ (₹6.7 కోట్లు) నిధులతో పునరాభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. త్వరలోనే ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

Similar News

News April 2, 2026

VZM ఉమ్మడి జిల్లాలో డివిజన్లు, వార్డుల సంఖ్య పెంపు

image

ఉమ్మడి జిల్లాలో డివిజన్లు, వార్డుల సంఖ్య పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం నోటిఫికేషన్ వెలువడింది. విజయనగరం 50 నుంచి 62కు, సాలూరు 29 నుంచి 32కు, నెల్లిమర్ల 20 నుంచి 23కు, పార్వతీపురం 30 నుంచి 36కు, బొబ్బిలి 31 నుంచి 36కు, పాలకొండ 20 నుంచి 28 వార్డులకు పెంచారు. రాజాం అంశం కోర్టులో ఉంది. కమిషనర్ల ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం తుది నోటిఫికేషన్ రానుంది.

News April 2, 2026

ఉమ్మడి ప.గో.లో పెరిగిన వార్డుల సంఖ్య

image

రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఉమ్మడి ప.గో. జిల్లాలో కొన్ని మున్సిపాలిటీల స్వరూపం మారనుంది.
నిడదవోలు 28 నుంచి 32
జంగారెడ్డిగూడెం 29 – 32
నరసాపురం 31- 36
ఆకివీడు 20- 28
నూజివీడు 32- 36

News April 2, 2026

నేడు రాజ్యసభకు అమరావతి బిల్లు

image

ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత బిల్లుకు నిన్న లోక్‌సభలో ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఈ బిల్లు ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు రాజ్యసభ ముందుకు రానుంది. అక్కడ కూడా ఆమోదం లాంఛనమే కానుంది. అనంతరం బిల్లు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వద్దకు వెళ్తుంది. ఆమె ఆమోదముద్ర వేయగానే చట్ట రూపం దాలుస్తుంది. దీంతో ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతి నిలిచిపోనుంది.