News June 19, 2024
MBNR: ‘మినీ ట్యాంక్ బండ్‌గా మారిస్తే’

శ్రీరంగాపురంలోని రంగసముద్ర జలాశయం దాదాపు 3 కి.మీ. పొడవైన ఆయకట్టుతో పాటు ఆలయానికి మూడు వైపులా నీరు ఉండటంతో ఈ ప్రాంతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. కట్ట వెంబడి విద్యుద్దీపాలు, సేదతీరేందుకు బెంచీలు, మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేస్తే మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించి మినీ ట్యాంక్ బండ్‌గా మారిస్తే జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుంది.
Similar News
News December 25, 2025
MBNR: రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్.. రన్నర్‌గా పాలమూరు

రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలికల సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ మెదక్‌లోని మనోహరాబాద్‌లో నిర్వహించారు. ఈ టోర్నీలో మహబూబ్‌నగర్ బాలికల జట్టు రన్నర్స్ (2వ స్థానం)లో నిలిచిందని జిల్లా సాఫ్ట్ బాల్ అధ్యక్షుడు అమరేందర్ రాజు ‘Way2News’ప్రతినిధితో తెలిపారు. బాలికల విజయం పట్ల సంఘం సభ్యులు రాఘవేందర్, నాగరాజు, ఉమ్మడి జిల్లా నేతలు హర్షం వ్యక్తం చేశారు. కోచ్, మేనేజర్‌గా లక్ష్మీనారాయణ, సునీత వ్యవహరించారు.
News December 25, 2025
MBNR: ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ

బాలానగర్ మండలం పెద్దాయపల్లి చౌరస్తా సమీపంలో నారాయణపేట జిల్లా మరికల్ స్కూల్ బస్సు అదుపుతప్పి కింద పడ్డ సంఘటన తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ డి.జానకి ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానిక ఎస్సై లెనిన్ ప్రమాద సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
News December 24, 2025
MBNR: పీయూలో అథ్లెటిక్స్ ఎంపికలు ప్రారంభం

పాలమూరు విశ్వవిద్యాలయంలోని సింథటిక్ మైదానంలో దక్షిణ మండల అంతర్ విశ్వవిద్యాలయాల అథ్లెటిక్స్ (మహిళల) జట్టు ఎంపికలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. వీసీ ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్ హాజరై క్రీడలను ప్రారంభించారు. వర్సిటీలో అత్యాధునిక సింథటిక్ ట్రాక్ అందుబాటులో ఉండటం క్రీడాకారులకు వరం లాంటిదన్నారు. క్రీడాకారులు తమ ప్రతిభను చాటి విశ్వవిద్యాలయానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.


