News September 1, 2025
MBNR: ముఖ్యమంత్రి పర్యటన.. సభాస్థలాన్ని పరిశీలించిన ఎస్పీ

ఈ నెల 3న మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం వేములలో ఎస్‌జీడీ పరిశ్రమ రెండో యూనిట్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సభాస్థలాన్ని, ఇతర ఏర్పాట్లను సోమవారం జిల్లా ఎస్పీ జానకి పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లను ఆమె పర్యవేక్షించారు.
Similar News
News September 2, 2025
MBNR: జాతీయ లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలి- జిల్లా జడ్జి

జాతీయ రాష్ట్రన్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 13న జిల్లాలోని అన్ని కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా జడ్జి పాపిరెడ్డి అన్నారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు మోటార్ వెహికల్ యాక్సిడెంట్, ఎలక్ట్రిసిటీ, ప్రీలిటిగేషన్, డబ్బు రికవరీ, కుటుంబ తగాదాలు, బ్యాంక్, డ్రంక్ అండ్ డ్రైవ్, ఫ్రీ లిటిగేషన్ చెక్‌బౌన్స్ కేసులను రాజీకి వీలున్న కేసులు కక్షిదారులు వినియోగించుకోవలన్నారు.
News September 1, 2025
MBNR ఎస్పీ ప్రజావాణికి 13 ఫిర్యాదులు

MBNRలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 13 దరఖాస్తులు స్వీకరించినట్లు ఎస్పీ డి.జానకి తెలిపారు. స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి సంబంధిత అధికారులతో నేరుగా ఫోన్ ద్వారా మాట్లాడి తక్షణ చర్యలు చేపట్టేలా సూచనలు ఇచ్చారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రతి అభ్యర్థనపై పర్యవేక్షణ కొనసాగుతుందని, ప్రజలకు న్యాయం జరిగేలా కట్టుబడి ఉంటామన్నారు.
News September 1, 2025
మహబూబ్ నగర్ SP జానకి కీలక ప్రకటన

శాంతి భద్రతల పరిరక్షణ కోసం మహబూబ్ నగర్ జిల్లాలో సెప్టెంబర్ 01 నుంచి 30వ తేదీ వరకు పోలీస్ 30 యాక్ట్ సెక్షన్ అమలులో ఉంటుందని SP జానకి వెల్లడించారు. ప్రజాసంఘాలు, యూనియన్లు, రాజకీయ పార్టీలు పోలీస్ అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ప్రదర్శనలు, ధర్నాలు చేయరాదని స్పష్టం చేశారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.