News April 3, 2025

MBNR: ముగిసిన పరీక్షలు.. పిల్లలపై కన్నేసి ఓ ఉంచండి!

image

నిన్నటితో పదోతరగతి పరీక్షలు ముగిశాయి. దీంతో విద్యార్థులు ఫ్రీ బర్డ్స్ లాగా తిరగాలని భావిస్తారు. కాబట్టి తల్లిదండ్రులు వారి కదలికలపై ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు బైకులు ఇవ్వొద్దని, స్నేహితులతో చెరువులకు వెళ్లకుండా చూడాలన్నారు. వారు ఈత నేర్చుకుంటానంటే పేరెంట్సే పర్యవేక్షించాలని, మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్నారో లేదా గమనిస్తూ ఉండాలంటున్నారు. SHARE IT.

Similar News

News April 4, 2025

సామర్లకోట: మున్సిపల్ ఛైర్ పర్సన్‌తో సహా మరో నేతపై వైసీపీ సస్పెన్షన్ వేటు

image

సామర్లకోట మున్సిపల్ ఛైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తితో సహా జడ్పీటీసీ భర్త సూర్యనారాయణ మూర్తి (నరేశ్)పై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసినట్లు పార్టీ నేతలు స్పష్టం చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు పెద్దాపురం ఇన్‌ఛార్జ్ దొరబాబు ఆధ్వర్యంలో ఆ ఇద్దరు నేతలపై సస్పెన్షన్ వేటు వేసినట్లు వెల్లడించారు.

News April 4, 2025

వికారాబాద్: భార్యను తిట్టాడని కొట్టి చంపాడు!

image

తన భార్యను అసభ్యంగా తిడుతున్నాడని కోపోద్రిక్తుడైన వ్యక్తి కర్రతో చితకబాదడంతో వృద్ధుడు మృతి చెందాడు. ఎస్ఐ అరవింద్ వివరాలు.. మోమిన్‌పేట్ మం. ఏన్కతలలో కిష్టయ్య (75) వికలాంగ వృద్ధుడు. తన ఇంటి పక్క మహిళను అసభ్యంగా తిడుతున్నాడని ఆమె భర్త కర్రతో కొట్టాడు. తీవ్రగాయాలు కావడంతో చనిపోయాడని కిష్టయ్య పెద్ద కుమారుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ అరవింద్ వెల్లడించారు.

News April 4, 2025

ఖమ్మం జిల్లాలో నేటి నేటి ముఖ్యాంశాలు

image

∆} నేలకొండపల్లి మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} మధిర మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల పర్యటన ∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యాటక

error: Content is protected !!