News March 26, 2025
MBNR: మున్సిపల్ కార్మికులకు దక్కిన గుర్తింపు..!

తెలంగాణలో ఏ జిల్లాలో లేని విధంగా పాలమూరు జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్మికులకు గుర్తింపు దక్కిందని స్థానికులు తెలిపారు. ప్రతిరోజు మున్సిపల్ కార్మికులు పరిసరాలను శుభ్రం చేస్తూ పట్టణాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు కష్టపడుతున్నారు. వారి సేవలను గుర్తించిన మున్సిపాలిటీ వారి విగ్రహాలను రోడ్డుపై ఏర్పాటు చేసింది. వారి కష్టాన్ని గుర్తించి, అందరూ అభినందించాలని ఈ సందర్భంగా అధికారులు పిలుపునిచ్చారు.
Similar News
News March 29, 2025
నాగర్కర్నూల్: కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు ఇచ్చిన ఎమ్మెల్యే

నాగర్కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తిమ్మాజిపేట, బిజ్నిపల్లి, తాడూరు మండలాలకు చెందిన CMRF, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను 133 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే Dr.కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందన్నారు.
News March 29, 2025
అచ్చంపేట: వేలం పాట @ రూ.37.5 లక్షలు

అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో 2025- 26 సంవత్సరానికి గాను నిర్వహించిన గొర్రెలు, మేకలు, పశువుల సంతకు రూ.37.5 లక్షలకు అచ్చంపేటకు చెందిన కే.ఆంజనేయులు దక్కించుకున్నారు. ఈ వేలం పాటలో ఆరుగురు పాల్గొన్నారు. గతంలో రూ.33 లక్షలకు వేలంపాట పాడగా ఈ ఏడాది రూ.నాలుగు లక్షలు అదనంగా ఆదాయం మున్సిపాలిటీకి చేకూరింది. మున్సిపల్ ఛైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, కమిషనర్ యాదయ్య, కౌన్సిలర్లు, వేలం దారులు పాల్గొన్నారు.
News March 29, 2025
కల్వకుర్తి: ‘167 మంది మహిళలకు ఉద్యోగాలు ఇచ్చాం’

కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలంగాణ టాస్క్ సీవోవో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు. తుక్కుగూడ గ్రామ సమీపంలో ఉన్న ఎలక్ట్రానిక్ కంపెనీ ప్రతినిధులతో శనివారం ఆయన భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గానికి చెందిన దాదాపు 167 మంది మహిళలకు వివిధ రంగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు ఆయన చెప్పారు.