News November 1, 2024
MBNR: ముమ్మరంగా కురుమూర్తి జాతర ఏర్పాట్లు

పేదల తిరుపతి శ్రీ కురుమూర్తి స్వామి జాతరకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు దేవస్థాన సిబ్బందితో పాటు వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జాతరలో మురుగునీరు నిల్వ ఉండకుండా ఉండేందుకు కాల్వలలో చెత్తను తొలగిస్తున్నారు. ఉద్దాల గుండు వద్ద పిచ్చి మొక్కలను తొలగిస్తూ నేలను చదును చేస్తున్నారు. భక్తులకు మంచినీటి సౌకర్యం పనులను పూర్తి చేస్తున్నారు.
Similar News
News May 7, 2025
BREAKING.. గద్వాలలో భర్తను చంపిన భార్య

గద్వాల జిల్లాలో దారుణం జరిగింది. పోలీసుల వివరాలు.. కేటీదొడ్డ మండలం బసాపురం శివారులో భర్తను తన భార్య పద్మమ్మ ప్రియుడుతో కలిసి చంపింది. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరికి మరో ఇద్దరు సహాయం చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News May 7, 2025
MBNR: నూతన విద్యుత్ సబ్ స్టేషన్‌కు ఎమ్మెల్యే భూమి పూజ

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల సమీపంలో రు.3.29 కోట్లతో నూతనంగా నిర్మించిన విద్యుత్తు సబ్ స్టేషన్‌కు ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి శనివారం భూమి పూజ నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నూతన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయితే మహబూబ్‌నగర్ పట్టణంలోని కొన్ని ప్రాంతాలు, వివిధ గ్రామాల్లో కరెంటు సమస్య తీరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
News May 7, 2025
జడ్చర్ల: బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించిన మాజీ మంత్రి

జడ్చర్ల మున్సిపాలిటీ కావేరమ్మ పేట, రాఘవేంద్ర కాలనీ, జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆ పార్టీ జెండాను ఈరోజు ఆవిష్కరించారు. గంగాపూర్ గ్రామంలో మహిళలు బోనాలతో ఆయనకు స్వాగతం పలికారు. జడ్చర్ల నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు వరంగల్ సభకు రావాలని కోరారు.