News March 17, 2025
MBNR: మైనార్టీ గురుకుల కళాశాలల్లో ప్రవేశాలు

మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2025-26కు సంబంధించిన ప్రవేశాలకు ఇటీవలే నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసింది. ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా 20 కళాశాలలు ఉండగా.. వీటిలో 10 బాలుర, 10 బాలికల జూనియర్ కళాశాలు ఉన్నాయి. వీటిలో మొత్తం 1,600 సీట్లు ఉన్నాయి. MBNR-800, NGKL-320, WNP-160, NRPT-160, GWL-160 సీట్లు ఉండగా, ఈ నెల 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన వారికి SHARE IT.
Similar News
News September 17, 2025
రాష్ట్రవ్యాప్తంగా IT అధికారుల సోదాలు

TG: హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో IT అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రముఖ బంగారు దుకాణాల యజమానులే లక్ష్యంగా వారి ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. బంగారం లావాదేవీలు, ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకలపై సోదాలు చేస్తున్నట్లు సమాచారం. వరంగల్‌లోనూ తెల్లవారుజాము నుంచే ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
News September 17, 2025
చంద్రగిరి కోటలో కూలిన కోనేరు ప్రహరీ

భారీ వర్షానికి చంద్రగిరి కోటలోని పురాతన కోనేరు ప్రహరీ కూలింది. గతంలో ఈ కోనేరులో ఏపీ టూరిజం ఆధ్వర్యంలో బోటింగ్ నిర్వహిస్తుండేవారు. తర్వాత బోటింగ్ నిలిపివేశారు. ఆర్కియాలజీ అధికారి బాలకృష్ణారెడ్డి కోనేరు గోడను పరిశీలించారు. అధికారులకు దీనిపై నివేదిక పంపనున్నట్లు తెలిపారు. వర్షం ఎక్కువగా పడటంతోనే కోనేరు గోడ కూలిందని పురావస్తు శాఖ అధికారులు నిర్ధారించారు.
News September 17, 2025
చిత్తూరు: ప్రియురాలి ఇంట్లో వ్యక్తి ఆత్మహత్య

చిత్తూరులో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తవణంపల్లె మండలం దిగువమారేడుపల్లికి చెందిన దేవరాజులు(40) భార్య, పిల్లలను వదిలేసి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. 9ఏళ్లుగా గంగన్నపల్లికి చెందిన ఓ మహిళతో సహజీవనం చేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఏమైందో ఏమో మంగళవారం సాయంత్రం ఆమె ఇంట్లోనే అతను ఉరేసుకున్నాడు. మొదటి భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ నెట్టికంటయ్య తెలిపారు.