News March 15, 2026

MBNR: మొబైల్ లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం

image

తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లాలో న్యాయ సేవలను మరింత విస్తరించేందుకు 2 మొబైల్ లోక్ అదాలత్ వాహనాలను కొనుగోలు చేసింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత మాట్లాడుతూ.. ఈ వ్యాన్లు ప్రతినెల రోటేషన్ పద్ధతిలో జిల్లాలకు పంపి లిటరసీ క్యాంపులు, లీగల్ సర్వీసెస్ జైలు సందర్శనలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

Similar News

News April 19, 2026

MBNR: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ప్రజల విలవిల

image

మహబూబ్ నగర్ జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భూత్పూర్ మండలం కొత్త మొల్గరలో 43.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్ 43.4, గండీడ్ మండలం సల్కర్ పేట 43.3, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 43.2, అడ్డాకుల 43.0, కోయిలకొండ మండలం పారుపల్లి 42.9, కౌకుంట్ల 42.7, మహబూబ్ నగర్ అర్బన్ 42.6, దేవరకద్ర 42.5 ఉష్ణోగ్రత నమోదయింది.

News April 19, 2026

MBNR: ప్రముఖ కవి కమలేకర్‌ దాగోజీరావు కన్నుమూత

image

మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ప్రముఖ కవి, పండితులు ఆచార్య కమలేకర్‌ దాగోజీరావు శనివారం ఉదయం కన్నుమూశారు. భగీరథ కాలనీలోని ఆయన నివాసంలో పార్థివదేహాన్ని సందర్శనార్థం ఉంచారు. నేటి సాయంత్రం 4 గంటలకు వీరన్నపేట శివాలయం శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతిపట్ల సాహితీలోకం ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది.

News April 18, 2026

జడ్చర్ల: సురేశ్ మృతిపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు

image

జడ్చర్ల మండలం కోడుగల్ గ్రామ పంచాయతీ పరిధిలోని బిమ్లాగాని తండాకు చెందిన కాట్రావత్ సురేష్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ చదువుతూ ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందాడు. అతడి మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ శనివారం పెద్దింటి రవీంద్రనాథ్ జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.