News January 22, 2026
MBNR: మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లకు దరఖాస్తులు

తెలంగాణ మోడల్ స్కూల్లో వచ్చే విద్యా సంవత్సరం గాను 6వ తరగతి ప్రవేశాలతో పాటు 7-10తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 28 నుంచి Feb 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఆరో తరగతిలో 100 మంది విద్యార్థులను తీసుకుంటారు. ఉమ్మడి పాలమూరులో కోడేర్, వెల్దండ, కొత్తకోట, ఘనపూర్, పెబ్బేర్, గండీడ్, ధన్వాడ, కోస్గిలో మోడల్ స్కూల్‌లు ఉన్నాయి. SHARE IT
Similar News
News April 14, 2026
హన్మకొండ: మే 11 నుంచి ఇండ్ల గణన

రాష్ట్రంలో మే 11 నుంచి ప్రారంభం కానున్న ఇండ్ల గణనను పారదర్శకంగా నిర్వహించాలని జనగణన రాష్ట్ర సంచాలకులు భారతి హోళికేరి ఆదేశించారు. సోమవారం కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలుకు ఈ డేటా కీలకమని పేర్కొన్నారు. హన్మకొండ జిల్లాలో ఇప్పటికే 87 శాతం ఎన్యుమరేషన్ పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి వెల్లడించారు.
News April 14, 2026
భూగర్భజలాల పెంపునకు చర్యలు చేపట్టండి: కలెక్టర్

జిల్లాలో జలధార పథకం కింద భూగర్భ జలాల మట్టం పెంపుదలకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జలధార కార్యాచరణ ప్రణాళికపై సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్ మీటింగ్ హాలులో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని చెరువుల పూడికలను ఉపాధి హామీ పథకం కింద తీసేందుకు మంజూరు ఉత్తర్వులు సిద్ధం చేయాలన్నారు.
News April 14, 2026
యోగాతో ఆరోగ్యం: కలెక్టర్

ఆనందమయ జీవితాన్ని సొంతం చేసుకునేందుకు యోగా అద్భుత అవకాశమని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానంలోని అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ హాల్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా అమరావతి యోగా యూట్యూబ్ ఛానల్ ప్రత్యక్ష ప్రసారాలను ప్రారంభించారు. ఎంతో మంది యోగాచరణను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకున్నారన్నారు.


