News March 20, 2025
MBNR: రంజాన్ మాసం.. హాలీమ్‌కు సలాం.!

రంజాన్ నెలలో దర్శనమిచ్చే నోరూరించే వంటకం హలీం. ఉపవాసాలుండే ముస్లింలతో పాటు హిందువులు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పటికే ఉమ్మడి MBNR జిల్లా వ్యాప్తంగా పట్టణాల్లో, ఆయా మండలాల కేంద్రాల్లో హలీం సెంటర్లు దర్శనమిస్తున్నాయి. మాంసం, గోధుమలు, పప్పుదినుసులు, నెయ్యి, డ్రైఫ్రూట్స్‌తో కలిపి ఉడికించి తయారు చేస్తారు. చివర్లో వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీరతో గార్నిష్ చేసి ఇస్తారు.మీరు తింటే ఎలా ఉందో కామెంట్ పెట్టండి?
Similar News
News March 20, 2025
మహబూబ్‌నగర్‌లో AR కానిస్టేబుల్ సూసైడ్

మహబూబ్‌నగర్‌లో ఏఆర్ కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నారు. సీఐ అప్పయ్య తెలిపిన వివరాలిలా.. స్థానిక గౌడ్స్ కాలనీలో నివాసముంటున్న 2009 బ్యాచ్ కానిస్టేబుల్ ఆకుల శ్రీనివాస్(38) ఏడాది క్రితం రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఆర్థిక, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో కొన్ని రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆయన మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతుడి భార్య మమత ఫిర్యాదుతో కేసు నమోదైంది.
News March 20, 2025
BUDGET.. పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులకే ప్రాధాన్యం

రాష్ట్ర బడ్జెట్‌లో ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు ప్రాధాన్యం ఇచ్చింది. KLIకు రూ.800కోట్లు, కోయిల్‌సాగర్ రూ. 80.73కోట్లు, నెట్టెంపాడుకు రూ.144కోట్లు, సంగంబండకు రూ.98.08కోట్లు, నల్లమలలో పర్యాటక అభివృద్ధికి రూ.242 కోట్లు, కురుమార్తి ఆలయ అభివృద్ధికి రూ.110 కోట్లు, పాలమూరు వర్సిటీకి రూ.50కోట్లు కేటాయించగా పాలమూరు ప్రాజెక్టుకు నిరాశే మిగిలింది. బడ్జెట్‌పై మిత్రమ స్పందన వస్తోంది.
News March 20, 2025
మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు

ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కల్పించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి వైద్యులను ఆదేశించారు. బుధవారం మూసాపేట మండల పరిధిలోని జానంపేట పీ.హెచ్.సీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగుల వైద్య చికిత్సను పరిశీలించి సమస్యలపై రోగులని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నందున, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కలెక్టర్ ఆదేశించారు.