News September 6, 2025

MBNR: రాష్ట్రంలోనే మన యూనివర్సిటీ NO:1

image

రాష్ట్రంలోనే పాలమూరు విశ్వవిద్యాలయం PM-ఉషా పథకం కింద రూ.100 కోట్ల గ్రాంట్ అందుకుంది. అనేక విశేష విజయాలను సాధించి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యా విస్తరణలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. NAAC ద్వారా గుర్తింపు పొందింది. HYDలోని శిల్పరామంలో ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలమూరు విశ్వవిద్యాలయం ప్రత్యేకంగా ఒక స్టాల్‌ను ఏర్పాటు చేసింది.

Similar News

News September 6, 2025

తిరుమల: దర్శనానికి 24 గంటలు

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు శిలా తోరణం వరకు క్యూలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 69,531 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,439 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.49 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించింది.

News September 6, 2025

రాజోలు: గురువుకు గుడి కట్టిన శిష్యులు

image

విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుడికి ఆయన శిష్యులు దైవంగా భావించి ఒక మందిరాన్ని ఏర్పాటు చేసి అందులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చింతలపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉత్తమ ఉపాధ్యాయులు, రెడ్ క్రాస్ అవార్డు గ్రహీత గుబ్బల రంగారావు శిష్యులు ఏర్పాటు చేశారు. విగ్రహాన్ని శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ అల్లూరి సూర్యనారాయణరాజు ఆవిష్కరించారు.

News September 6, 2025

సీఎంతో అనకాపల్లి డీసీఎంఎస్ ఛైర్మన్ భేటీ

image

అనకాపల్లి జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) అభివృద్ధికి సహకారం అందించాలని చైర్మన్ కోట్ని బాలాజీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం విశాఖ వచ్చిన సీఎం చంద్రబాబును శుక్రవారం కలిసి డీసీఎంఎస్‌కు సంబంధించి పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. విశాఖలో డిసిఎంఎస్ ద్వారా రైతులకు ఎరువులు, విత్తనాలు, విద్యార్థులకు పుస్తకాలు విక్రయించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.