News February 1, 2025
MBNR: రిజర్వాయర్‌లో పడి చిన్నారులు మృతి
జడ్చర్ల మండలం ఉదండాపూర్ రిజర్వాయర్‌లో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన జడ్చర్ల మండలంలో జరిగింది. గ్రామస్థుల వివరాలు.. ఉదండాపూర్ గ్రామానికి చెందిన యాదయ్యకు ఉదండాపూర్ రిజర్వాయర్ పక్కన వ్యవసాయ పొలం ఉంది. వారి ఇద్దరు పిల్లలు భాగ్యలక్ష్మి(7), మహేష్(4) శనివారం పొలానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు ప్రాజెక్టు నీటిని గుంతలో పడడంతో మహేష్ మృతదేహం లభించింది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News February 1, 2025
సోమవారం ప్రజావాణి రద్దు: కలెక్టర్
వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. జిల్లాలోని ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించి సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు సమర్పించుటకు కలెక్టరేట్ కు రావద్దని సూచించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు.
News February 1, 2025
జనగామ: విజయోస్తు స్మార్ట్ లెర్నింగ్ మెటీరియల్ ఆవిష్కరణ
జిల్లాలోని పదవ తరగతి విద్యార్థులందరూ ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులు కావాలనే ఆశయంతో పదవ తరగతి గణితం విజయోస్తు స్మార్ట్ లెర్నింగ్ మెటీరియల్‌ను శనివారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆవిష్కరించారు. ఈ స్టడీ మెటీరియల్‌ను ఉపయోగించుకొని గణితంలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. అలాగే జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని కోరారు.
News February 1, 2025
అల్లూరి: రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి(UPDATE)
అల్లూరి జిల్లా ఎటపాక మండలం గోపాలపురం గ్రామం వద్ద ఎదురెదురుగా వస్తున్న కంటైనర్, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు ప్రమాద స్థలంలోనే అక్కడికక్కడే మృతిచెందారు. వివరాల్లోకి వెళ్తే అల్లూరి జిల్లా ఎటపాక మండలం కన్నాపురం గ్రామానికి చెందిన ఇద్దరు తమ సమీప బంధువులు భద్రాచలంలోని ఆసుపత్రిలో వైద్యం నిమిత్తం ఉండడంతో బంధువులను పరామర్శించడానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఘటన జరిగిందన్నారు.