News February 1, 2025
MBNR: రిజర్వాయర్‌లో పడి చిన్నారులు మృతి

జడ్చర్ల మండలం ఉదండాపూర్ రిజర్వాయర్‌లో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన జడ్చర్ల మండలంలో జరిగింది. గ్రామస్థుల వివరాలు.. ఉదండాపూర్ గ్రామానికి చెందిన యాదయ్యకు ఉదండాపూర్ రిజర్వాయర్ పక్కన వ్యవసాయ పొలం ఉంది. వారి ఇద్దరు పిల్లలు భాగ్యలక్ష్మి(7), మహేష్(4) శనివారం పొలానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు ప్రాజెక్టు నీటిని గుంతలో పడడంతో మహేష్ మృతదేహం లభించింది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News February 15, 2026
2.50 లక్షల మంది భక్తులు క్షేత్రంలో ఉన్నారు: కలెక్టర్

శ్రీశైల క్షేత్రంలో ఒక్కరోజు నిద్రిస్తే అనేక యుగాల పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసంతో దాదాపు 2.50 లక్షల మంది భక్తులు ప్రస్తుతం క్షేత్రంలో ఉన్నారని కలెక్టర్ రాజకుమారి అన్నారు. ఎస్పీ సునీల్ షోరాణ్, జేసీ కార్తీక్ తో కలిసి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించారు. పాగాలంకరణ కార్యక్రమానికి దాదాపు 7 నుంచి 8 వేల మంది భక్తులను అనుమతించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
News February 15, 2026
టెన్త్ అర్హతతో 22,195 ఉద్యోగాలు

రైల్వేలో 22,195 గ్రూప్-D పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. టెన్త్, ఐటీఐ అర్హత గలవారు మార్చి 2 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18-33 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్ బట్టి సడలింపు ఉంటుంది. CBT, PET, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PwBD, మహిళలకు రూ.250. వెబ్‌సైట్: https://www.rrbcdg.gov.in/
News February 15, 2026
BREAKING: భువనగిరిలో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

భువనగిరి స్వర్ణగిరి ఆలయం సమీపాన తెలంగాణ గురుకుల మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన బాల ఆకాష్ అనే పదో తరగతి విద్యార్థి బావిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


