News November 30, 2024

MBNR: రూ.2 లక్షల లోపు రుణమాఫీకి సిద్ధం.. !

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రూ.2 లక్షల లోపు రుణమాఫీ చేసేందుకు అధికారులు జాబితా సిద్ధం చేశారు. ఉమ్మడి జిల్లాలో పలు సమస్యలతో రుణమాఫీ కానీ 40,759 మంది రైతులకు గాను రూ.381.56 కోట్ల నిధులు విడుదల చేయనున్నారు. జిల్లాల వారీగా అత్యధికంగా NGKL జిల్లాలో 11,960, MBNR-8462, GWL-8262, WNPT-5,086, NRPT-6989 రైతులకు రుణమాఫీ లబ్ధి చేకూరనుంది. వీటిని నేడు రైతు పండుగ సభలో సీఎం ప్రకటించనున్నారు.

Similar News

News December 4, 2024

వనపర్తి: వ్యాపారిని హత్య చేసిన తోటి వ్యాపారి: SP

image

నగల <<14783426>>వ్యాపారి హత్య<<>> కేసులో కీలక విషయాలు వెలుగుచూశాయి. వనపర్తి SP తెలిపిన వివరాలు.. గుంటూరు జిల్లాకు చెందిన శేషు(43) బంగారం, వెండి ఆభరణాలను హోల్‌సేల్‌ ధరలకు సరఫరా చేసేవాడు. బిజినేపల్లిలో గోల్డ్ షాపు నడుపుతున్న దీపక్‌మాలి(రాజస్థాన్)కు గత నెలలో కొన్ని నగలు ఇచ్చాడు. ఈ క్రమంలో తన అప్పు తీర్చుకునేందుకు శేషు వద్ద నగలు, డబ్బు కొట్టేయాలనుకున్నాడు. తమ్ముడితో కలిసి ప్లాన్ ప్రకారం NOV 21న శేషును హత్య చేశారు.

News December 4, 2024

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో భూ ప్రకంపనలు..?

image

తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ భూకంపం వచ్చింది. ఈరోజు ఉదయం 7.26 నుంచి 7.31 వరకు ఆయా ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే నాగర్‌కర్నూల్, వనపర్తి, షాద్ నగర్, మహబూబ్‌నగర్, అచ్చంపేట తదితర ప్రాంతాల్లో భూమి కంపించిందని పలువురు సోషల్ మీడియాలో చెబుతుండగా దీనిపై అధికారులు వివరణ ఇవ్వాల్సి ఉంది. అయితే మీ ప్రాంతంలో భూకంపం వచ్చిందా కామెంట్ చేయండి.

News December 4, 2024

కొడంగల్: భార్యాభర్తల గొడవ.. భార్య సూసైడ్

image

భార్యాభర్తల మధ్య గొడవ జరిగడంతో భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన బొంరాస్‌పేట్ మండలం మదన్ పల్లి తండాలో జరిగింది. ఎస్ఐ రావుఫ్ తెలిపిన వివరాలు.. తండాకు చెందిన లాలిబాయి, అమినా నాయక్‌ ఇద్దరు దంపతులు. భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో దంపతుల మధ్య వివాదం నెలకొంది. మంగళవారం ఇద్దరు గొడవ పడగా భార్య గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వారికి ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుర్లు ఉన్నారు.