News February 12, 2025

MBNR: రెండు రోజులకు శవమై తేలింది!

image

ఇంట్లో గొడవపడి బయటికెళ్లిపోయిన మహిళ శవమై తేలిన ఘటన గండీడ్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. పగిడ్యాల్‌కి చెందిన పద్మమ్మ(38) ఆదివారం ఇంట్లో జరిగిన చిన్నపాటి గొడవకు అలిగి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు ఎంతవెతికినా ఆమె జాడ కనిపించలేదు. ఈ క్రమంలో రెండు రోజుల తర్వాత పగిడ్యాల్ మల్లమ్మచెరువులో శవమై తేలింది. పద్మమ్మకు భర్త, ముగ్గరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. కేసు నమోదైంది.

Similar News

News February 12, 2025

ఎన్నికల్లో అభ్యర్థిగా ‘నోటా’.. ఓట్లు ఎక్కువ వస్తే?

image

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాన్ని అడ్డుకునేందుకు నోటాను అభ్యర్థిగా చేర్చాలని EC సన్నాహాలు చేస్తోంది. MH, హరియాణా వంటి రాష్ట్రాల్లో ఈ విధానం ఇప్పటికే అమలులో ఉంది. ఒకవేళ నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే మళ్లీ ఎన్నిక నిర్వహించే అవకాశముంది. తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థికి రీ ఎలక్షన్స్‌లో పోటీ చేసే అర్హత లేదు. ఇందులోనూ నోటాకే ఎక్కువ ఓట్లు వస్తే అత్యధిక ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు.

News February 12, 2025

మెదక్: 21 జడ్పీటీసీ, 190 ఎంపీటీసీ స్థానాలు

image

మెదక్ జిల్లాలో 21 మండలాల్లో జడ్పీటీసీ, 190 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఈనెల 15న ఓటర్ లిస్ట్ డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేయనున్నారు. జిల్లాలో పురుషులు 2,52,279 మంది, మహిళలు 2,71,878 మంది, ఇతరులు 9 మంది మొత్తం 5,23,966 మంది ఓటర్లు ఉన్నారు. నామినేషన్ల కోసం 70 కేంద్రాల్లో 91 మంది ఆర్ఓలు, జడ్పీటీసీ ఎన్నికల కోసం 21+4 రిటర్నింగ్ అధికారులుగా జిల్లా అధికారులను నియమించారు.

News February 12, 2025

బాపట్ల: ఈ పాప మీకు తెలుసా.!

image

బాపట్ల జిల్లా మహిళాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శ్రావణి అనే పాప ఈనెల 5వ తేదీ నుంచి ఆశ్రయం పొందుతుందని, పాప తల్లిదండ్రులు కానీ సంరక్షకులు కానీ తగు ఆధారాలు చూపించి పాపను తీసుకువెళ్లాలని బాపట్ల జిల్లా శిశు సంక్షేమ అధికారి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 30 రోజులలోపు పాపను తీసుకెళ్లని ఎడల ప్రభుత్వ అదేశాల ప్రకారం అనాథగా ప్రకటించి దత్తత ఇస్తామని తెలిపారు.

error: Content is protected !!