News February 12, 2025
MBNR: రెండు రోజులకు శవమై తేలింది!

ఇంట్లో గొడవపడి బయటికెళ్లిపోయిన మహిళ శవమై తేలిన ఘటన గండీడ్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. పగిడ్యాల్కి చెందిన పద్మమ్మ(38) ఆదివారం ఇంట్లో జరిగిన చిన్నపాటి గొడవకు అలిగి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు ఎంతవెతికినా ఆమె జాడ కనిపించలేదు. ఈ క్రమంలో రెండు రోజుల తర్వాత పగిడ్యాల్ మల్లమ్మచెరువులో శవమై తేలింది. పద్మమ్మకు భర్త, ముగ్గరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. కేసు నమోదైంది.
Similar News
News July 6, 2025
తెనాలి: టెలిగ్రామ్ యూజర్లకు డీఎస్పీ జనార్ధనరావు హెచ్చరిక

వాట్సాప్, టెలిగ్రామ్ యూజర్లు అప్రమత్తంగా ఉండాలని తెనాలి డీఎస్పీ జనార్ధనరావు సూచించారు. ‘apk’ ఫైల్స్, ప్రభుత్వ అధికారుల గ్రూపుల్లో చేరమంటూ వచ్చే సందేశాలను నమ్మవద్దని కోరారు. వీటిని డౌన్లోడ్ చేస్తే ఫోన్ నేరగాళ్ల వశమై, యాప్ల నుంచి నగదు తస్కరిస్తారని హెచ్చరించారు. మీ స్నేహితులకు మీ తరఫున మెసేజ్లు పంపి ఫోన్ను హ్యాక్ చేస్తారని తెలిపారు.
News July 6, 2025
తెలుగు పాఠ్యాంశంలో ‘సీతాకోక చిలుక’ గేయం

మహారాష్ట్ర ప్రభుత్వ బాలభారతి ఒకటో తరగతి తెలుగు వాచకంలో కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రాసిన “సీతాకోక చిలుక” గేయం పాఠ్యాంశంగా చోటు దక్కించింది. తొట్టంబేడు మండలానికి చెందిన బాల సుబ్రహ్మణ్యం ఉపాధ్యాయుడు, రచయిత, మిమిక్రీ కళాకారుడు. తన గేయం తెలుగు విద్యార్థులకు పాఠ్యాంశంగా చేరడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. పలువురు ఆయనను అభినందిస్తున్నారు.
News July 6, 2025
పల్నాడు: చుక్కల భూములపై కలెక్టర్ ఆదేశాలు

పల్నాడు జిల్లాలోని చుక్కల భూములపై జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. భూ సమస్యల సమీక్షా సమావేశంలో రెవెన్యూ అధికారులతో ఆయన చర్చించారు. నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యను వేగంగా పరిష్కరించాలని సూచించారు. భూమిపై తగిన ఆధారాలు చూపిన రైతుల భూములను 22ఎ జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.