News November 20, 2025
MBNR: రేపు డయల్ యువర్ RM

ఆర్టీసీ సమస్యలపై ‘డయల్ యువర్ RM ” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పాలమూరు రీజినల్ మేనేజర్ సంతోష్ కుమార్ “Way2News”తో తెలిపారు. ఈనెల 21న సాయంత్రం 4:00 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఆర్టీసీ సమస్యలు, సూచనల కోసం 99592 26295కు సంప్రదించాలన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News November 22, 2025
MBNR: సాఫ్ట్ బాల్..200 మంది హాజరు

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-17, 19 బాల బాలికలకు సాఫ్ట్ బాల్ జట్ల ఎంపికలు మహబూబ్‌నగర్‌లోని స్టేడియంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా SGF కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి హాజరయ్యారు. మొత్తం 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వేణుగోపాల్, జగన్మోహన్ గౌడ్, బి.నాగరాజు, జి.రాఘవేందర్, మేరి పుష్ప, సుగుణ నాగమణి, రమణ, లక్ష్మీ నారాయణ క్రీడాకారులు పాల్గొన్నారు.
News November 22, 2025
MBNR: 24 గంటలు సిద్ధంగా ఉన్నాం.. ఫోన్ చేయండి: ఎస్పీ

బాలికలు, మహిళల భద్రతే పోలీసు శాఖ ప్రధాన బాధ్యత అని మహబూబ్‌నగర్ ఎస్పీ డి.జానకి అన్నారు. బస్‌స్టాండ్‌లు లేదా బహిరంగ ప్రదేశాల్లో అసురక్షితంగా అనిపిస్తే, వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 100కు లేదా షీ టీమ్ నంబర్ 8712659365కు కాల్ చేయాలని సూచించారు. మహిళల భద్రత కోసం పోలీసులు 24 గంటలు సిద్ధంగా ఉంటారని ఆమె హామీ ఇచ్చారు.