News September 15, 2024
MBNR: రైతుకు’భరోసా’వచ్చేనా?

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న వేలాది వ్యవసాయేతర భూములకు గతంలో రైతుబంధు పథకం ద్వారా పలువురు రూ.కోట్లు అందుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా కేవలం సాగు పొలాలకు మాత్రమే రైతు భరోసా అందించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలో రైతులకు రాష్ట్ర సర్కారు రైతు భరోసా ద్వారా తీపికబురు చెప్పేందుకు కార్యచరణ పూర్తి చేసే పనిలో నిమగ్నమయింది.
Similar News
News December 31, 2025
MBNR: GOOD NEWS.. వీరికి రూ.1,00,000

దివ్యాoగులను సకలాoగులు & దివ్యాంగులు, దివ్యాంగులను వివాహం చేసుకొనిన ప్రభుత్వం రూ.1,00,000/- ల వివాహ ప్రోత్సాహక బహుమతిని అందిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారని వయోవృద్దుల సంక్షేమ శాఖసంక్షేమ అధికారిని యస్.జరీనా బేగం తెలిపారు. 19/05/2025 తరువాత వివాహం చేసుకున్న దంపతులు www.epass.telangana.gov.in వెబ్ సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలని, ఫారంను సమగ్ర శిశు అభివృద్ధి ఆధికారి కార్యాలయంలో సమర్పించాలన్నారు.
News December 31, 2025
MBNR: ఉపకార వేతనాలకు దరఖాస్తు గడువు పొడిగింపు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరానికి ఉపకార వేతనాల దరఖాస్తు గడువును 3.3.2026 తేదీ వరకు పొడిగించినట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి ఎస్సీడీ. డి. సునీత ఒక ప్రకటన తెలిపారు. వివిధ కోర్సులలో విద్యను అభ్యసిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఉపకార వేతనాలు పొందేందుకు https://telanganaepass.cgg.gov.in వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News December 31, 2025
MBNR: 26,220 యూరియా ఉంది: వ్యవసాయ అధికారి

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 17,610 మంది రైతులు నేటి వరకు 52,545 యూరియా బ్యాగ్స్‌ను ఆన్లైన్‌లో బుక్ చేసుకోవడం జరిగిందని జిల్లా వ్యవసాయ అధికారి బి.వెంకటేష్ తెలిపారు. అందులో 46,193 బ్యాగ్స్ రైతులు కొనుగోలు చెయ్యగా.. ఇంక 26,220 యూరియా బస్తాలు యాప్‌లో కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. రైతులు ఎటువంటి ఆందోళన చెంద కుండా యూరియా బుకింగ్ యాప్ ద్వారా కొనుగోలు చేయాలని వెల్లడించారు.


