News September 10, 2025
MBNR: రైతులు ALERT..కృషి విజ్ఞాన కేంద్రం కీలక సూచనలు

ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతు పొలాలలో వరి పంటలో ఆకులు చుట్టుకుని పోయి ఆకుల పైన తెల్లటి మచ్చలు ఏర్పడుతున్నాయని పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు. తామర పురుగుల వల్ల ఏర్పడతాయని, వెంటనే వరిసాగు చేసే రైతులు ఫటేరా @4 కిలోలు ఎకరానికి లేదా/ క్లోరన్ త్రినిల్ ప్రోల్ @60 మి.లీ ఎకరానికి లేదా/ ఫిప్రోనిల్ @400 మిల్లీలీటర్లు ఎకరానికిలో పిచికారి చేస్తే దీని ఉద్ధృతి తగ్గుతుందన్నారు.
Similar News
News September 10, 2025
నేపాల్‌లో చిక్కుకున్న విశాఖ వాసులు

విశాఖ నుంచి విహారయాత్రకు వెళ్లిన 11 మంది నేపాల్‌లో చిక్కుకుపోయారు. అక్కడ అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో తిరిగి వచ్చేందుకు అవకాశం లేకపోవడంతో సహాయం కోసం వారి కుటుంబీకులకు సమాచారం అందించారు. ఎంపీ భరత్, మంత్రి లోకేశ్ దృష్టికి కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు. వీరందరూ ఎల్ఐసీలో ఉద్యోగాలు చేస్తున్నారని, తిరిగి రప్పించేందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారన్నారు.
News September 10, 2025
మహిళలు నేడు ఈ వ్రతం చేస్తే చాలా మంచిది

నేడు ఉండ్రాళ్ల తద్ది. ఈ వ్రతం గురించి ఆ పరమేశ్వరుడే స్వయంగా పార్వతీ దేవికి వివరించారని చెబుతారు. ఈ వ్రతాన్ని స్త్రీలు భక్తి విశ్వాసాలతో నిష్ఠానుసారంగా ఆచరిస్తే వారికి సర్వాభీష్ట సిద్ధి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. పెళ్లైన మహిళలు భర్త, సంతానంతో కలిసి ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ నోమును ఆచరిస్తారు. పెళ్లికాని అమ్మాయిలు కూడా ఆచరించొచ్చని, ఫలితంగా మంచి భర్త దొరుకుతాడని వేద పండితులు అంటున్నారు.
News September 10, 2025
‘ఉండ్రాళ్ల తద్ది’ వ్రతం ఎలా చేయాలి?

మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే పార్వతీ దేవి సకల సౌభాగ్యాలు వర్ధిల్లే వరమిస్తుందని పండితులు చెబుతున్నారు. ‘మహిళలు నేడు సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. బియ్యం పిండితో ఉండ్రాళ్లు చేయాలి. గౌరీ దేవిని పూజించి ఆమెకు ఉండ్రాళ్లు నివేదించాలి. ఐదుగురు ముత్తైదువులను పిలిచి చీర, రవికలతో పాటు ఉండ్రాళ్లు వాయనమివ్వాలి. వారి పాదాలకు పసుపు రాసి, ఆశీస్సులు పొంది, అక్షతలు వేయించుకుంటే శుభం కలుగుతుంది’ అని అంటున్నారు.