News April 15, 2025
MBNR: రైతుల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ రాష్ట్రంలో రైతులు పుట్టెడు దుఃఖంలో ఉన్నారని, వారి సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో, రైతు డిక్లరేషన్‌లో ఏ రకంగా పంట నష్టపోయినా పరిహారం ఇస్తామని వాగ్దానం చేశారని, ఇప్పుడు రైతులను నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు. సాగు నీరందించడంలో కాంగ్రెసోళ్లు ఫెయిల్ అయ్యారని ఫైర్ అయ్యారు.
Similar News
News September 15, 2025
ITR ఫైలింగ్ గడువు పొడిగింపు లేదు: IT శాఖ

ITR ఫైలింగ్‌కు గడువు పొడిగించలేదని ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు స్పష్టం చేశారు. దీనిపై వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. ఐటీ విభాగం నుంచి వచ్చే అప్డేట్లను ఎప్పటికప్పుడు చూసుకోవాలని తెలిపారు. కాగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ ఐటీఆర్ దాఖలు చేసేందుకు ఇవాళే చివరి తేదీ. ఇప్పటివరకు దాదాపు 6 కోట్లకుపైగా పన్ను చెల్లింపుదారులు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేశారు.
News September 15, 2025
బాపట్ల ఎంపీకి 5వ ర్యాంక్

2024-25వ సంవత్సరానికి సంబంధించి లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ MPల పనితీరు నివేదికను పార్లమెంట్ ప్రతినిధులు ఆదివారం విడుదల చేశారు. ఈ నివేదికలో బాపట్ల MP హరికృష్ణ ప్రసాద్ 5వ స్థానంలో నిలిచారు. ఆయన లోక్‌సభలో మొత్తం 73 ప్రశ్నలు అడిగారు. 14 చర్చల్లో పాల్గొన్నారు. ఆయన హాజరు శాతం 86.76గా ఉంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకును కేటాయించినట్లు పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి. ఆయన పనితీరుపై మీ కామెంట్..!
News September 15, 2025
కాంగ్రెస్‌తో పొత్తుకు తేజస్వీ బ్రేక్!

జాతీయ స్థాయిలో కూటమిగా ఉంటూ రాష్ట్ర ఎన్నికల్లో వేరుగా పోటీ చేసేందుకు ఇండీ కూటమి పార్టీలు మొగ్గు చూపుతున్నాయి. బిహార్‌లో ఉన్న 243 స్థానాల్లోనూ పోటీ చేస్తామని ఇండీ కూటమిలోని RJD ప్రకటించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీంతో తేజస్వీ కాంగ్రెస్‌తో పొత్తుకు బ్రేక్ ఇచ్చారా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. గతంలో పంజాబ్, హరియాణా ఎన్నికల్లో ఆప్, పశ్చిమబెంగాల్‌లో TMC ఒంటరిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.