News January 20, 2025
MBNR: రైతు భరోసా వారికే: మంత్రి జూపల్లి
వ్యవసాయ యోగ్యమైన భూముల రైతులకే రైతు భరోసా లబ్ధి చేకూరుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఆదివారం HYDలో మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఇచ్చిన రైతుబంధు పథకంలో రూ.25 వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమల్లో గ్రామ సభ నిర్ణయాలే కీలకం అని చెప్పారు. గ్రామ సభలో వచ్చిన అభ్యంతరాలను 10 రోజుల్లో నివృత్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు.
Similar News
News January 20, 2025
NGKL: అర్హులందరికీ సంక్షేమ పథకాలు: అడిషనల్ కలెక్టర్
బిజినేపల్లి మండల కేంద్రంలోనీ తాహశీల్దార్ కార్యాలయాన్ని ఆదివారం జిల్లా అదనపు కలెక్టర్ పి.అమరేందర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా రైతు భరోసా సర్వే వివరాలను తహశీల్దార్ శ్రీరాములును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేవిధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కథలప్ప, ఏవో నీతీ, ఎంపీఓ నరసింహులు, మండల ఏఈవోలు పాల్గొన్నారు.
News January 20, 2025
MBNR: ప్రజలు QR కోడ్ స్కాన్లను సద్వినియోగం చేసుకోవాలి: ఎస్పీ
పోలీస్ సేవల పై ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలిపేందుకు ఏర్పాటు చేసినా QR కోడ్ స్కాన్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ జానకి ప్రజలకు సూచించారు. పోలీస్ సేవలగురించి తమ అభిప్రాయం తెలిపేందుకు QR కోడ్ స్టికర్లను జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో, సర్కిల్ కార్యాలయాలలో, డీఎస్పీ కార్యాలయం, జిల్లా పోలీస్ కార్యాలయాలో అతికించామని తెలిపారు.
News January 19, 2025
మహబూబ్‌నగర్‌లో అసాంఘిక కార్యకలాపాలు?
మహబూబ్ నగర్ పట్టణంలోని గడియారం చౌరస్తాలో పట్టపగలే చీకటి పనులు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చౌరస్తాలో చుట్టూ బ్యానర్లు ఉండటంతో, పలువురు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పుడుతున్నట్లు సోషల్‌మీడియాలో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. జనసంచారం ఉన్న ప్రాంతంలోనే ఇలా బరితెగించారని స్థానికులు మండిపడుతున్నారు. అధికారులు స్పందించి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టవేయాలని మహబూబ్‌నగర్ ప్రజలు కోరారు.